YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

ఏపీ అసెంబ్లీలో ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

హైదరాబాద్
వ్యక్తిగత దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఘటనపై అయన స్పందించారు. రాజకీయంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలిచివేసింది. సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నిదర్శనమని అన్నారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి. మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం. మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలని అయన అన్నారు.

Related Posts