విజయవాడ, నవంబర్ 22,
నారా చంద్రబాబు నాయుడు. ఆరడుగుల నిఖార్సైన మనిషి. 71 ఏళ్ల నిప్పులాంటి జీవితం. 40 ఏళ్ల స్వచ్ఛ రాజకీయం. తెలుగు జాతి నిండు గౌరవం. ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ఐటీ ప్రధాత. తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత. నవ్యాంధ్ర విధిరాత. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చిన్నమచ్చ కూడా లేని నాయకుడు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా అంటని నిత్య కార్మికుడు. రాజకీయ రుషి. అలాంటి చంద్రబాబుపైనే అసంబద్ధ ఆరోపణలు చేశారు నీచులు. దారుణమైన కామెంట్లతో పెద్దాయనను తీవ్రంగా క్షోభ పెట్టారు. గుండె పగిలేలా బాధపెట్టారు. భోరున విలపించేలా నీచంగా అవహేళన చేశారు. చంద్రబాబు జీవితమంతా తెరిచిన పుస్తకం. ఆస్తులంతా ఏటేటా ప్రజల ముందు ఉంచుతున్న స్వచ్చ నాయకుడు. నారా వారి పల్లె నుంచి అమరావతి వరకూ.. రాజకీయంగా అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు. విద్యార్థి నాయకుడి నుంచి.. మూడు సార్లు ముఖ్యమంత్రి, మూడు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా రాణించారు. ఐరన్‌లేడీ ఆఫ్ ఇండియా-ఇందిరాగాంధీనే ఢీ కొట్టిన మొనగాడు.. మోదీపై ధర్మపోరాటం చేసిన ధీరుడు.. కోట్ల నుంచి వైఎస్ వరకూ.. అనేక ఉద్దండులను ఎదుర్కొన్న యోధుడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ స్థాయిలో చక్రం తిప్పి.. దేవెగౌడను దేశ ప్రధానిగా ఎంపిక చేసిన చాణక్యుడు. ఇలా.. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి ఉన్న నాయకుడు మరొకరు లేరనే చెప్పాలి. అందుకే కాబోలు.. చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీయలేమని అనుకున్నారు కాబోలు.. దొంగదారిన దొంగదెబ్బ తీస్తున్నారు వైసీపీ నాయకులు. క్యారెక్టర్ అసాసినేషన్‌కు దిగుతున్నారు. చంద్రబాబు వారి శత్రువు కాబట్టి.. ఆయననేదైనా అంటే అనొచ్చు.. పాపం భువనేశ్వరి ఏం చేశారు? ఎప్పుడైనా రాజకీయాల జోలికి వచ్చారా? ఎవరినైనా చిన్నమాటన్నా అన్నారా? అసలు భువనేశ్వరికి వైసీపీ పార్టీ పూర్తి పేరైనా తెలిసుంటుందా? అలాంటిది.. ఏమాత్రం రాజకీయ వాసనలు అంటని భువనేశ్వరిపై.. ఈ కౌరవ వారసులు అలాంటి ఆరోపణలు చేయడం నీచాతి నీచం. దారుణం. దుర్మార్గం. ఉన్మాదం. వాళ్లు మనుషులు కాదు.. రాక్షస మూకలు. నీతినియమాలు, సభ్యతా, సంస్కారం లేని చండాలురు. చంద్రబాబుది చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం. అతను-ఆమె. కొడుకు-కోడలు-మనవడు. అంతే. భార్య భువనేశ్వరి అంటే ఆయనకి ప్రాణం. భర్తే ఆమెకు సర్వస్వం. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే భర్తను.. కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటారు భువనేశ్వరి. వేళకు భోజనం చేసేలా ఆరాటపడతారు. హెరిటేజ్ MDగా, NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి సైతం నిత్యం బిజీగా ఉంటారు. కరోనా కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎనలేని సేవ చేశారు. అమరావతి కోసం చేతికున్న బంగారు గాజులు విరాళంగా ఇచ్చారు. అలాంటి భువనేశ్వరి క్యారెక్టర్‌కే కలంకం తెచ్చేలా వైసీపీ నేతలు నిండు సభలో ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. గుండెపగిలేలా విలపించారు. 1981, సెప్టెంబర్ 10న చంద్రబాబు-భువనేశ్వరిల వివాహం జరిగింది. 1983, జనవరి 23న లోకేశ్ పుట్టారు. ఇక, నోరో.. డ్రైనేజో అర్థం కాదు కానీ, వైసీపీ మూకల నోటి నుంచి వస్తున్న మాధవరెడ్డి ఆ టైమ్‌లో అసలు రాజకీయాల్లోనే లేరు. 1985లో మాధవరెడ్డి టీడీపీలో చేరారు. కారుకూతలు కూసే నీచులకు ఈ వివరాలన్నీ తెలీక కావు.. విజ్ఞత లేకనో.. బుద్ధి, జ్ఞానం.. సంస్కారం లేకనో.. లేక, రాజకీయ ప్రయోజనం కోసమో, చంద్రబాబును నైతికంగా పడగొట్టాలనో.. అలా మాధవరెడ్డి పేరుతో పిచ్చిపిచ్చి పేలాపనలు పేలుతున్నారు. ఇంగితం లేని వెదవలు. చంద్రబాబు-భువనేశ్వరీలు కడిగిన ముత్యాల్లాంటి వారని తెలుగు ప్రజలందరికీ తెలుసు. పురంధేశ్వరీ చెప్పినట్టు.. ఎన్టీఆర్ కుటుంబమంతా నైతిక విలువలతో పెరిగిన వారే. ఈ వైసీపీ కూతులకు చంద్రబాబును తాత్కాలికంగా భావోద్రేగానికి గురి చేసుంటారేమో కానీ, ఆయన కంట కారిన ప్రతీ కన్నీటి చుక్కకు.. ఫలితం అనుభవించక తప్పదు. ప్రజాక్షేత్రంలో ఇంతకంటే ఘోర పరాభవం తప్పదు. శిక్ష పడాల్సిందే. తగిన శాస్త్రి జరగాల్సిందే.