YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆన్ లైన్ లో క్లాసులు

ఆన్ లైన్ లో క్లాసులు

ముంబై, నవంబర్ 22,
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో కూడా స్కూళ్లు, కాలేజీల‌ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో ప్రమాద‌క‌ర స్థాయికి చేరింది.. దీంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇక, కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో.. విద్యాసంస్థలు మూతపడి.. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులే జరగగా.. ఇప్పుడు కూడా అదే విధంగా విద్యాసంస్థలు ప‌నిచేయానున్నాయి..ఇక, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సీఏక్యూఎం మొత్తం 9 పేజీల‌తో కూడిన ఆర్డర్‌ను విడుదల చేసింది.. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ రాష్ట్రాలు కూడా క‌నీసం  50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసే విధంగా ఆదేశించాల‌ని సీఏక్యూఎం కోరింది. ఎన్సీఆర్ రీజియ‌న్‌లోని ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం వ‌ర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని త‌న ఆదేశాల్లో సీఏక్యూఎం స్పష్టం చేసింది.

Related Posts