YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులపై ఏపీ సర్కార్ యూ టర్న్

మూడు రాజధానులపై ఏపీ సర్కార్ యూ టర్న్

అమరావతి
మూడురాజధానుల అంశాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ హైకోర్టుకు  అడ్వకేట్ జనరల్ సోమవారం తెలిపారు. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్ని ఏపీ కేబినెట్ వెనక్కి తీసుకుంది. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉండవచ్చని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. దీనితో ఒక్కసారి 29 రాజధాని గ్రామాల్లో కలకలం రేగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనేక రాజధాని గ్రామాల్లో రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభమయ్యాయి.
రాజధాని వివాదాలపై మొత్తం  93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ చట్టాలు చెల్లవంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. ప్రభుత్వ నిర్ణయాలు, కమిటీల నివేదికలు రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. కొంతమంది టీడీపీ నేతలు కుడా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. 2020, అగస్టు 4 అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు విధించింది. ఇక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీలు చేయగా.. 2020, అగస్టు 26న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు విధించిన స్టేటస్కో ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15 నుంచి  15… ఏపీ రాజధాని వికేంద్రీకరణ కేసులపై హైకోర్టులో రోజూవారి విచారణలు ప్రారంభమయని సంగతి తెలిసిందే. ఈ  విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. టెక్నికల్గా చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు. దీంతో అమరావతి రైతులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
అమరావతి ఐకాస స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.  ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందే. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలి. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది

Related Posts