YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఆర్డీయే చట్టం పునురుద్దరణ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

సీఆర్డీయే చట్టం పునురుద్దరణ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

అమరావతి
సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లు ను మంత్రి ప్రవేశపెట్టారు. ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించారు. భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలి లో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకోడానికి కారణాలుగా ప్రభుత్వం  తెలిపింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో పేర్కోంది. తక్షణమే  సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో పేర్కోంది.

Related Posts