YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వరద తాకిడి తుఫాన్ బాధితులకు రెడ్ క్రాస్ సహకారం

వరద తాకిడి తుఫాన్ బాధితులకు రెడ్ క్రాస్ సహకారం

నెల్లూరు నవంబర్ 22
నెల్లూరు నగరం వేంకటేశ్వర పురం లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతం అయిన భగత్ సింగ్ కాలనీ మరియు గాంధీ గిరిజన కాలనీ లో ఉన్న లోతట్టు ప్రాంతం లోని నీట మునిగిన ప్రజలకు వరుసగా 2వ రోజు గోమతి నగర్ లోని పునరావాస కేంద్రంలో  అన్నీ వసతులతో ఉచితంగా 500 భోజనాలు పంపిణీ చేయడం జరిగినది.
నెల్లూరు రైల్వే స్టేషన్ లో  ఆగి ఉన్న రెండు ట్రైన్స్ లోని పాసెంజర్స్ కు  రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఫుడ్ పాకెట్స్ ను ఇవ్వడం జరిగినది. ట్రైన్స్ లో ఉన్న ప్రతి పాసెంజర్ తో మాట్లాడి పాకెట్స్ ను అందించడం జరిగినది.ఈ సందర్భంగా  రెడ్ క్రాస్ ఛైర్మన్  పి. చంధ్ర శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ తుఫాన్ లో చిక్కుకుని నీట మునిగిన ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా ఆహార పొట్లాలు  చేశామని ఇలాంటి కార్యక్రమాలకు రెడ్ క్రాస్ ఎప్పుడు ముందుండి సేవ చేస్తుందని తెలియ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్  కె.వి.యన్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు  కోవూరు మండల ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు సుమారు 6000 మందికి వాటర్ ప్యాకెట్స్ అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కన్వీనర్ సి. హెచ్ అజయ్ బాబు, యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్  రంజని, కొ- కన్వీనర్  ఉదయ్ శంకర్, సెక్రెటరీ పి, మస్తానయ్య, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts