నెల్లూరు
నెల్లూరు జిల్లా కావలిలో అమరావతి రైతుల పాదయాత్రకు కావలి పట్టణంలో అడుగడుగునా పోలీసుల అడ్డంకులు స్వాగతం పలికాయి.వెంకటేశ్వర స్వామి రథం ముందు డప్పులు, మంగళతాళాలు ఉండకూడదు అంటూ పోలీసుల హుకుం జారీ చేశారు. దీంతో వాయిద్య కళాకారులను అడ్డుకున్న డీఎస్పీ ప్రసాద్ తో రైతులు వాగ్వాదానికి దిగారు.మిగతా జిల్లాల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఎంటటు పోలీసులను మహిళలు నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు.నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22 వరోజుకు చేరుకుంది.అమరావతి రైతులకు కొత్తపల్లిలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు.గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు.