YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

శక్తిమంతమైన వ్యక్తుల జాబితా టాప్‌ టెన్ లో మోదీ

శక్తిమంతమైన వ్యక్తుల జాబితా టాప్‌ టెన్ లో మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్‌ టెన్‌లో మోదీ చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్‌‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీ 9వ స్థానంలో నిలిచారు.2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించింది. ‘ఈ భూమ్మీద 7.5 బిలియన్ల మనుషులు జీవిస్తున్నారు. ఇందులో 75 మంది వ్యక్తులు శక్తిమంతమైన వారిగా నిలిచారు. అంటే ప్రతి 10కోట్ల మందిలో ఒక శక్తిమంతమైన వ్యక్తి ఉన్నారు’ అని ఫోర్బ్స్‌ పేర్కొంది.ఈ ఏడాది బాబితాలో ప్రధాని మోదీ 9వ స్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌(13వ స్థానం), యూకే ప్రధాని థెరిసా మే(14వ స్థానం) తదితరులను అధిగమించి మోదీ టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అవినీతిని నిర్మూలించేందుకు 2016లో ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఫోర్బ్స్‌ ప్రస్తావించింది.ఇక ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారిగా ప్రథమస్థానంలో నిలిచారు. శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ను దాటేసి జిన్‌పింగ్‌ ఈసారి తొలిస్థానం దక్కించుకున్నారు. పుతిన్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 3, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 4, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 5, పోప్‌ ఫ్రాన్సిస్‌ 6, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ 7, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌ 8, ఆల్ఫాబెట్‌ సీఈవో లారీ పేజ్‌ 10వ స్థానంలో నిలిచారు.కేశ్ అంబానీ @ 32ఇక భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. 32వ స్థానంలో నిలిచారు. మోదీ కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు ముకేశ్ కావడం విశేషం. ఈ సందర్భంగా భారత టెలికాం రంగాన్ని శాసించేలా ముకేశ్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ తీసుకొచ్చిన జియో నెట్‌వర్క్‌ను ఫోర్బ్స్‌ ప్రస్తావించింది.ఇక భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల 40వ స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ 12, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 36, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో 57, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అధినేత అబు బకర్‌ అల్‌ బాగ్దాది 73వ స్థానంలో ఉన్నారు.

Related Posts