YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తేనెతుట్టును కదిల్చిన జగన్

మళ్లీ తేనెతుట్టును కదిల్చిన జగన్

విజయవాడ, నవంబర్ 23,
ఉద్దేశం ఏదైనా, ఎందుకోసం అయినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజదాని తేనే తుట్టెను మరో సారి కదిల్చారు. మూడు రాజధానులపై వెనకడుగు వేస్తున్న సంకేతాలిచ్చి... చివరకు ఎటూ తేల్చకుండా, ఏపీ రాజధాని ఏదీ అంటే దిక్కులు చూసే సందిగ్ధ పరిస్థితి సృష్టించారు. వికేంద్రీకరణ తప్పదని, అదొక్కటే రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రం అని చెప్పు కొచ్చారు. అయితే, జగన్ రెడ్డి అనే కాదు, రాజకీయ నాయకులు ఎవరైనా,రాజకీయ ప్రయోజనాలు లేకుండా, ఆశించకుండా ఏ నిర్ణయం తీసుకోరు. జగన్ రెడ్డి వంటి రాజకీయ వ్యాపారులు,లేదా వ్యాపార రాజకీయ వేత్తలు, వ్యాపార ప్రయోజనాలు కూడా చూసుకుంటారు. ఈ నేపధ్యంలో మూడు రాజధానుల బిల్లును ఏ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను ఆశించిన జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి మళ్ళీ అదే వికీద్రీకరణ  మంత్రం జపిస్తున్నారు. ఎందు కోసం వెనకడుగు తీసి ముందడుగు వేశారు ఇలా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదల ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును దానితో పాటుగా సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టినన శాసన సభా వ్యవాహాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పదే పదే శ్రీ కృష్ణ కమిటి నివేదికను ప్రస్తావించారు. అమరావతి కంటే ప్రకాశం జిల్లా దొనకొండకు కమిషన్ ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదికను ప్రస్తావించడమే కాకుండా, ‘శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాదు,, అమరావతి ప్రాంతంలో  క‌నీస వ‌స‌తుల క‌ల్పనకే ల‌క్ష కోట్లు అవుతుంది. ఈ రోజు ల‌క్ష కోట్లు ప‌దేళ్లకు 6 ల‌క్షల కోట్లు అవుతుంది. గ‌త ప్రభుత్వ లెక్కల ప్రకార‌మే లక్షల కోట్లు క‌నీస వ‌స‌తుల‌కు వెచ్చించాల్సి ఉందని అన్నారు. అటు బుగ్గన ఇటు సీఎం మళ్ళీ మూలాలలోకి వెళ్ళడంతో, అసలు ప్రభుత్వం ఆలోచన ఏమిటి? రాజధాని ఇష్యూ ని మళ్ళీ హరికథ కాలక్షేపంలో ‘రెడ్డొచ్చె మొదలెట్టు’ అన్నట్లు, అమరావతి కథ మళ్ళీ మొదటికి వస్తుందా? అమరావతికి మొత్తానికే ఎసరు పెడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాగా 2014కు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే, దొనకొండ రాజదాని అవుతుందని ప్రచారం జరిగింది. అలాగే, జగన్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలు అక్కడ ముందుగానే భూముల పై ఇన్వెస్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.. అలాంటిదూ..రాలోచన ఏదైనా చేస్తున్నారా ? అనే అనుమానలు వినవస్తున్నాయి

Related Posts