నెల్లూరు, నవంబర్ 23,
ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే ఉంటున్నా. ఇక్కడి వారంటే ఇష్టం. ఈ ప్రాంతం అంటే ప్రేమ. అయినా, వికేంద్రీకరణే మా లక్ష్యం. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల నినాదంతో 2019లో ఎన్నికలకు వెళితే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. విజయం కట్టబెట్టారు. మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేశారంటూ.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం హాస్యాస్పదం అంటున్నారు అంతా. జగన్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏంటి.. మూడు రాజధానుల నినాదంతో జగన్‌రెడ్డి ఎన్నికలకు వెళ్లారా? అది కూడా 2019లోనా? ఏం చెప్పారు.. ఏం చెప్పారు.. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అమరావతికి మీరు మద్దతిచ్చిన విషయం మీరు మరిచారో ఏమో కానీ.. జనం మదిలో ఆ మాటలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఆనాడు మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా వీడియోల రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం ఇష్టం లేకే అమరావతికి మద్దతిస్తున్నామని.. 33వేల ఎకరాలు చాలవని.. ఇంకా భూసేకరణ చేయాలంటూ.. ప్రతిపక్ష నేతగా ఆనాడు అసెంబ్లీలో మీరు మాట్లాడిన చిలక పలుకులు అప్పుడే మరిచిపోయారా? అంటూ పార్టీలు, ప్రజలు మండిపడుతున్నారు. అమరావతికి మద్దతిచ్చారు కాబట్టే.. 2019లో జగన్‌కు అంత మెజార్టీ వచ్చింది. అదే, మీ దురుద్దేశ్యాన్ని అప్పుడే బయటపెట్టి ఉంటే.. ఆనాడే తాము అధికారంలోకి వస్తే రాజధానిని మూడు ముక్కలు చేస్తామని చెప్పుంటే.. ప్రజలు మీకు ఎలా బుద్ది చెప్పేవారో తెలిసుండేది. ఓటుతో బండకేసి కొట్టేవారు. వైసీపీని బొంద పెట్టేవారు. 153 కాదు కదా.. 1..5...3...లో ఏదో ఒక నెంబర్‌కే పరిమితం చేసేవారు. అమరావతి రీజియన్‌లోనూ వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే.. జగన్ సీఎం అయినా అమరావతి అలానే వెలుగొందుతుందనే నమ్మకంతోనే. లేదంటే.. ఓటర్ల తీర్పు మరోలా ఉండేది. ఆ ప్రజాగ్నిలో వైసీపీ దహించుకుపోయుండేది. ఆంధ్రప్రదేశ్‌కు ఇంతటి దౌర్భాగ్యం తప్పుండేది.. అంటూ జగన్‌రెడ్డి తాజా వ్యాఖ్యలపై అంతా విరుచుకుపడుతున్నారు. అంత నిస్సిగ్గుగా.. తాము 2019లో మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళితే ప్రజలు గెలిపించారని జగన్‌రెడ్డి సభలో చేసిన కామెంట్లపై ప్రజలతో పాటు ప్రతిపక్షం ఫైర్ అవుతోంది. లోకేశ్ జగన్‌ను తుగ్లక్ 3.0 తో పోల్చారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అన్నారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు.. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్.. అంటూ నారా లోకేశ్ జగన్‌ను ట్విట్టర్‌లో ఆటాడుకున్నారు. జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి మండిపడ్డారు