YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పక్కా ప్లానింగ్ తో షా, జగన్

పక్కా ప్లానింగ్ తో షా, జగన్

విజయవాడ, నవంబర్ 23,
భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావలి.. అయితే, అది మోడీనో అమిత్ షానో అనుకుంటే అయ్యే పని కాదు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాలనే  నమ్ముకున్నా మరో సారి  ఢిల్లీ పీఠం దక్కదు, ఈ నిజం కమల దళం గుర్తించింది. అందుకే, దక్షణాదిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రలలో పట్టు సాధించేందుకు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వైసీపీ, తెరాసకు ప్రత్యాన్మాయంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్  పార్టీలను పక్కకు నెట్టి అ స్థానాన్ని అక్రమించేందుకు అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారు. అంతే కాదు, ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా  ఖతం చేసేందుకు అక్కడ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ, తెరాసలతో బీజేపే  ‘సుపారీ’ ఎగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. అదలా, ఉంటే ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం కూడా, బీజేపీ, వైసీపీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమేనా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి, గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గిపు మొదలు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం వరకు, చివరకు సాగు చట్టాల రద్దు నిర్ణయం వరకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే, కేవలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కాకుండా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా సిద్డంవుతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. గతంలో చేసిన తప్పులు దిద్దుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలను కమల దళం మొదలు పెట్టిందని  అంటున్నారు. అందుకే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబదించి ఎన్నికలకు ముందే ఏపీలో ఒకలా  తెలంగాణలో మరోలా సెకండ్ ప్లేస్, ప్రధాన ప్రత్యర్ధి రోల్ కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించిందని  విశ్వసనీయ వర్గాల సమాచారం.   కాగా, నవంబర్ మొదటి వారంలో, తిరుపతిలో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  ఎలాంటి దాపరికం లేకుండా ఖుల్లం ఖుల్లా జగన్ రెడ్డి’ కి తమ ప్లాన్ వివరించారని, అందుకు మరో మార్గం లేక జగన్ రెడ్డి తలూపారని అంటున్నారు. అమిత్ షా ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఇతరత్రా ఏదన్నా సహాయం కావాలంటే, రాష్ట్రంలో రాజకీయంగా తమకు (బీజేపీ) అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో మొదటిది, మూడు రాజధానులకు మంగళం పాడి ఒకే రాజధానికి ఒప్పు కోవడం అని తేల్చి చెప్పినట్లు సమచారం. అందులో భాగంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రెడిట్’ బీజేపీ ఖాతాలో పడేలా స్కెచ్ సిద్దమైందని అంటున్నారు. నిజానికి, రాజకీయంగా చూస్తే  ముందు నుంచి రాజధాని ఉద్యమానికి అన్నివిద్లా మద్దతు తెలుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది  టీడీపీ ఒక్కటే. కాబట్టి, పోరాట విజయం క్రెడిట్ కూడా టీడీపీకే దక్కాలి. కనీ ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో కాకుండా, బీజేపీ ఖాతాలో వేసేందుకు కూడా అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారని సమాచాం. అందుకే, రెండు సంవత్సరాలకు పైగా రైతులు ఆందోళన చేస్తున్నా, 23 రోజులుగా మహిళలు మహా పాదయాత్ర చేస్తున్నా ఉలుకు పలుకు లేని, జగన్ ప్రభుత్వం బీజేపీ నాయకులు యాత్రలో పాల్గోనగానే, మూడు రాజధానులను మూట కట్టేసిందని, ఇది బీజేపీ, వైసేపీ జాయింట్ యాక్షన్ కావచ్చని అంటున్నారు. అంతే కాకుండా రానున రోజుల్లో బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్’లో బీజేపీ పొలిటికల్ మైలేజిని పెంచే ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీస్కోవచ్చని అంటున్నారు. అందులో సవరించిన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ విక్రయం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం వంటి నిర్ణయాలు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అయితే, బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసని, తెలుగు రైతు పోరాట విజయం తెలుగు దేశం పార్టీకే చెందుతుందని, జేఏసీనాయకులు, రైతులు  అంటున్నారు.

Related Posts