హైదరాబాద్, నవంబర్ 23
రాజకీయాల్లో సుధీర్గ అనుభవం.. ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవులు నిర్వహించడమే కాకుండా నమ్ముకున్న పార్టీకి పూర్తి న్యాయం చేసారు ఆ రాజకీయ నేత. పదవులు లేకపోయినప్పటికి పార్టీ తరుపున ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసారు. 25సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రత్యర్థులు తప్పితే శత్రువులు పెద్దగా లేని రాజకీయ నాయకుడు ఆయన. పదవిలో ఉన్న లేకపోయినా అవినీతి రహిత నాయకుడిగా పార్టీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిమానం కూడా చూరగొనగలిగారు. ఆయనే ఎమ్మెల్సీగా మరో రాజకీయ మజిలీకి సిద్దమైన యల్ రమణఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి తెలుగుదేశం పార్టీ తరుపున సర్వీయ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో యువ ఎమ్మెల్యేగా మొదటి సారి శాసన సభలో అడుగు పెట్టారు యల్ రమణ. స్వర్గీయ ఎన్టీఆర్ శిక్షణలో నిఖార్సైన, అవినీతి రహిత రాజకీయాలకు పరిమితం అయ్యారు తప్ప ఏనాడూ దిగజారుడు రాజకీయాలకు రమణ పాల్పడలేదనే సవభిప్రాయం పార్టీ ముఖ్యనేతల్లో నెలకొంది. అందుకే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా రమణ ప్రతిభను గుర్తించి పార్లమెంట్ కు సైతం పంపిచారు.పార్టీలో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ సమాన గౌరవం ఇస్తూ సమన్యాయం పాటించారు యల్ రమణ. అందుకే ఎలాంటి సందేహం లేకుండా తెలంగాణ తెటుగుదేశం పగ్గాలను రమణకు అప్పజెప్పారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీకి సుధీర్గ కాలం అధ్యక్షుడిగా పని చేసిన రమణ సామాన్య కార్యక్తల దగ్గర నుండి రాష్ట్ర నాయకుల వరకూ అందరితో సత్సంబంధాలు కొనసాగించారు. దాదాపు ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అద్యక్షులుగా పని చేసినపకపటికీ ఎక్కడా చిన్న వివాదం తలెత్తకుండా పార్టీని నడిపించారు యల్ రమణ.తెలుగుదేశం పార్టీ అద్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ముఖ్యనేతలతో పాటు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఇబ్బందికర పరిస్థితులను సృుష్టించారు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తలియని అయోమయ పరిస్ధితుల్లో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీలో అంతర్గత విభేదాలు తలెతత్తకుండా సమర్ధవంతంగా వ్యవహరించారు యల్ రమణ. పార్టీలోక్రింది స్థాయి శ్రేణులు అధైర్య పడకుండా భరోసా కల్పిస్తూ పార్టీని ముందుకు నడిపించారు రమణ.2014 తర్వాత వచ్చిన అనేక ఎన్నికలను తెలుగుదేశం పార్టీ తరుపున ధైర్యంగా ఎదుర్కొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికికి ఎలాంటి ప్రమాదం లేదనే సంకేతాలను పార్టీ క్యాడర్ పంపించే ప్రయత్నం చేసారు రమణ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రమణ సారథ్యమే మంచిదని అనేక సందర్బాల్లో చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. రమణ సారథ్యంలో పనిచేయాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆశించిన ఫలితాలు వస్తాయని, అందురు యల్ రమణ సేవలు ఉపయోగించుకోవాలని పలు సందర్బాల్లో చంద్రబాబు పార్టీ నేతలకు హితవు పలికిన సందర్బాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయాల్లో రమణ ఎంత పారదర్శకంగా పనిచేసారో అర్ధం అవుతోంది. రాజకీయాల పట్ల అంతటి నిబద్దత, నిస్వార్ధ సేవ, అంకితభావం ఉన్నాయి కాబట్టే యల్ రమణను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. సో ఎమ్మెల్సీగా చట్టసభలో యల్ రమణ మరోసారి అడుగుపెట్టబోతున్నారు.