విజయవాడ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాసారు. ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టివిలో చూసి ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే...నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు గా హస్పటల్ గదిలో నన్ను, నా భార్యను ఏకారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం హస్పటల్ లో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు. మీరు చేసిన హింస తాలుకు అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం. అణిచివేత తో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? కుటుంబాన్ని అవమాన పరచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని అయన లేఖలోపేర్కోన్నారు. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆవాళ నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాధను చేశారని అయన ఆరోపించారు. శపధాలు చేయకండి చంద్రబాబు. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండని అన్నారు.