విజయవాడ
కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం పోలీసులు భారీగా మొహరించారు. ఒకవైపు అధికార పార్టీ కార్యకర్లు భారీ సంఖ్యలో చేరుకుని బారికేడ్ల వద్ద పార్టీ నినాదాలు చేసారు. సోమవారం సీన్ రిపీట్ అవుతుందని ఈ రోజు ఐదు వందలకు పైగా పోలీసులను మోహరించారు. మరో వైపు మున్సిపల్ కార్యాలయం సమీపంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. మున్సిపల్ కార్యాలయం నుండి 100 మీటర్ల దూరం లో బరికేడ్లు మూళ్ళ కంచెను పోలీసులు వేసారు.