నవంబర్ 23,
తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది.మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. ఈ మేరకు ఉపసంహరణ తీర్మానం చేశారు. మండలిని యథావిధిగా కొనసాగించాల్సిన అవశ్యకతను వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన మండలి పునరుద్ధరణ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం సభ వాయిదా రాజధానుల బిల్లుకు ఆమోదం పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన ఏపీ ప్రభుత్వం నేడు ఇందుకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొద్దిసేపటి క్రితం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు కనుక ఈ నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికైనా వేర్పాటువాద ముప్పు తప్పదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.