YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి మళ్లీ వాన కష్టాలు

ఏపీకి మళ్లీ వాన కష్టాలు

విజయవాడ, నవంబర్ 23,
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. జలప్రళయంతో చాలామంది ప్రజలు  ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల  ఎత్తులో విస్తరించిఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక -తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. మరొక ద్రోణి,  నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల మీదనున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా ఏపీలో మరో మూడు  రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తర కోస్తాఆంధ్ర, యానాం: ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు,  మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ  కోస్తా ఆంధ్ర: ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి  ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాయలసీమ: ఈ రోజు, రేపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు  చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం  తెలిపింది. 

Related Posts