YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు సొంత అల్లుడిపై వేళ్లు

వివేకా హత్య కేసు సొంత అల్లుడిపై వేళ్లు

కడప, నవంబర్ 23,
 తల్లిని చంపితే ఆస్తి కలిసొస్తుంది.. తండ్రిని చంపితే.. సంపద పెరుగుతుంది.. అయినోళ్లను హత్య చేస్తే ఉన్నదంతా మనకే సొంతమవుతుందీ.. అనుకుంటే పొరపాటు.. చనిపోతే ఆస్తి వస్తుందేమో కానీ.. చంపితే శిక్ష పడుతుంది.. ఈ లాజిక్ తెలియక  కొందరు కత్తిమీద కాలు వేసి.. తర్వాత నాలుక్కరుచుకుంటారు. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివేకాను ఆస్తికోసం అయినవాళ్లే హత్య చేశారంటూ వస్తున్న మాటలు.. ఇప్పుడు మంటలు రేపుతున్నాయి.  మరి వస్తున్న ఆరోపణల్లో నిజమేంటి.. హత్య వెనుక దాగున్న అసలు కిల్లర్..ఎవరు..మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది సీబీఐ ఎంక్వయిరీ. రోజురోజుకు ట్విస్టులు మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.  అరెస్టులు సహా ఆరోపణల పర్వం జోరందుకుంది. తెర వెనుక ఏం జరుగుతుందో కానీ.. తెరపైకి కొత్త పాత్రలు వచ్చేస్తున్నాయి. వివేకా హత్యకేసులో అల్లుడి పాత్రవుందా?!. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి టార్గెట్‌గా భరత్‌ యాదవ్‌ అనే వ్యక్తి  ఆరోపణలు సంచనలంగా మారాయిప్పుడు. వివేకా హత్యకేసులో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, వాచ్‌మ్యాన్‌ రంగయ్య సహా ఎందర్నో సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. దస్తగిరి కన్ఫెన్షన్‌ రిపోర్ట్‌తో ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రపై  రాజకీయ దుమారం చెలరేగింది. ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సునీతా రాజశేఖర్‌రెడ్డి కేంద్రంగా సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐకి రాసిన లేఖ ప్లస్‌ భరత్‌ యాదవ్‌ సంచలన ఆరోపణలు.. 
కడప జిల్లాలో సంచలనంగా మారాయి. గతంలో ఇదే అంశం మీద నర్మ గర్భ వ్యాఖ్యలు చేస్తూ.. సింహాన్ని సింహాలే టచ్ చేస్తాయి. మాలాంటి చిట్టెలుకలకు సాధ్య పడదు. అంటూ ఈ కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఓ  హింట్ రిలీజ్ చేశాడు. తర్వాత భరత్ యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అదిరిపడ్డ.. భరత్ యాదవ్.. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనంటూ బాంబు పేల్చాడు. భరత్‌ యాదవ్‌.. ఇతను వివేకా హత్య  కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సునీల్‌ యాదవ్‌కు దగ్గరి బంధువు. సునీల్‌ తనకు అన్ని విషయాలు చెప్పాడని.. అతను చెప్పిన ప్రతీ మాటను సీబీఐ దృష్టికి తీసుకెళ్లానంటూ మీడియా ముందుకు వచ్చారు భరత్‌ యాదవ్‌. వివేకా హత్య  చేయించింది.. నిందితులకు డబ్బులు ఇచ్చింది సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అంటూ బాంబ్‌ పేల్చారాయన.  వైయస్ వివేకా హత్యకు సూత్రధారుడు అల్లుడు నరరెడ్డి రాజశేఖరరెడ్డే. కారణం.. ఇదొక ఆస్థి తగాదా. వివేకా సన్నిహితురాలు షమీమ్  కు మామగారి ఆస్తి మొత్తం వెళ్తుందనే కోణంలోనే ఈ హత్య జరిగిందని అంటున్నారు భరత్ యాదవ్. సునీల్ యాదవ్ నేరుగా తనతో వివేకా హత్య వివరాలు వెల్లడించినట్టు చెబుతున్నారు భరత్ యాదవ్.  ఇప్పటి వరకూ ఈ వివరాలు బయటకు చెప్పక పోవడానికి కారణం.. ప్రాణభయంగా చెప్పుకొస్తున్నారు భరత్. వైయస్ వివేకా హత్యకు గల కారణాలను మొట్టమొదటగా సిబిఐ వారికి అందించిన వ్యక్తిని తానే అంటున్నారు గోర్ల భరత్ యాదవ్. 

Related Posts