న్యూఢిల్లీ నవంబర్ 23
స్టెరిలైజింగ్ క్యూర్ అనేది చాలా అరుదు అని, కానీ హెచ్ఐవీ నుంచి సహజంగా బయటపడే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. నిజానికి కొన్ని దశాబ్ధాల కాలం నుంచి ఎయిడ్స్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లు విఫలమవుతూనే ఉన్నారు.ఎయిడ్స్ వ్యాధి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల మందికి హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్ సోకింది. 3.6 కోట్ల మంది ఆ వ్యాధితో మృత్యువాతపడ్డారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 37.7 మిలియన్ల మంది ఇంకా హెచ్ఐవీతో జీవిస్తున్నారు.తాజాగాఎయిడ్స్ వ్యాధి లక్షణాలతో బాధపడ్డ ఓ మహిళలో ఇప్పుడు హెచ్ఐవీ వైరస్ కనిపించకుండాపోయింది. హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడి.. శాశ్వతంగా కోలుకున్న వారిలో ఆమె ఒకరిగా నిలిచారు. 30ఏళ్ల ఆ మహిళ 2013లో హెచ్ఐవీ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అర్జెంటీనాలోని ఎస్పరాంజా నగరానికి చెందిన ఆ మహిళకు వైరస్ సోకింది. అయితే ఇప్పుడు ఆమెకు ఆ లక్షణాలు లేవని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో పరిశోధకులు తెలిపారు. ఆమె డీఎన్ఏలో కూడా వైరస్ ఆనవాళ్లు లేనట్లు గుర్తించారు. సహజరీతిలో ఆమె హెచ్ఐవీ నుంచి చికిత్స పొందినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నదానిపై పరిశోధకులు స్పష్టమైన కారణాలు చెప్పలేదు.హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్‌కు స్టెరిలైజింగ్ క్యూర్ ద్వారా ఆ మహిళ చికిత్స పొందినట్లు తెలుస్తోంది. బోస్టన్ రాగన్ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన జూ యూ, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసర్చ్ ఇన్ రెట్రోవైరస్‌కు చెందిన నటాలియా లౌఫర్ పరిశోధకులు మహిళ హెచ్ఐవీ రోగిని స్టడీ చేశారు.