YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అధికార వికేంద్రీకరణ పేరుతొ అడుగులు

అధికార వికేంద్రీకరణ పేరుతొ అడుగులు

విజయవాడ, నవంబర్ 24,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కు తీసుకున్నారు. జగన్ భయపెడితే భయపడే వాడు కాదు. బెదిరిస్తే బెదిరేటోడు కాదు. చెప్పినా వినేటోడు కాదు. మరి ఎందుకు ఈ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. జగన్ మడమ తిప్పినట్లేనా? కొత్త చట్టాలను తెస్తామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పినప్పటికీ ఏ రూపంలో వస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బిల్లులు ఏ రూపంలో ఎప్పుడు వస్తాయో మంత్రులు, ఎమ్మెల్యేలకే తెలియదు. ముఖ్యమంత్రి జగన్ మాటల్లో అందరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకుని బిల్లులలో మార్పులు చేర్పులు చేసి తీసుకుని వస్తామని చెప్పారు. చాలా సులువుగా ప్రజాభిప్రాయాన్ని సేకరించే వీలుంటుందంటున్నారు. ఆగస్టు వరకూ అయితే ఈ బిల్లులు వచ్చే అవకాశం లేదు. సెప్టంబరు నెలలోనే ఈ కొత్త బిల్లులను తెచ్చేందుకు అన్నీ లెక్కలు వేసుకుని జగన్ మరీ సిద్ధమవుతున్నారు. అప్పటికి అంతా క్లియర్ అవుతుందంటున్నారు. మూడు రాజధానులు అని పేరు లేకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో కొత్త బిల్లులు వచ్చే అవకాశముంది. ఇక ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కూడా జగన్ మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. రాజమండ్రి కార్పొరేషన్ లాంటివి మినహా అన్ని చోట్ల దాదాపు ఎన్నికలు ముగిసినట్లే. వీటిలో 90 శాతం వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. జనసేన అతి కొద్ది సీట్లలో గెలిచింది.  పంచాయతీల నుంచి కార్పొరేషన్ ల వరకూ అధికార వికేంద్రీకరణ లేదా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేసి పంపే విధంగా వైసీపీ ప్లాన్ చేసే అవకాశముంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మూడు రాజధానులకు సానుకూలత ఉందని చెప్పుకునే వీలు ప్రభుత్వానికి కలుగుతుంది. న్యాయస్థానాల్లోనూ ఇది ఒక చిన్న ఆయుధంగానైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందుకే పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకూ తీర్మానాలు చేసి పంపే విధంగా పార్టీ నాయకత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద ఎప్పుడు బిల్లులు తెస్తాడో తెలియదు కాని, సరైన టైంలోనే తెస్తాడన్నది పార్టీ నుంచి విన్పిస్తున్న టాక్.

Related Posts