విజయవాడ, నవంబర్ 24,
రాష్ట్ర ఆర్థికశాఖ గణాంకాల్లో మాయాజాలం కనిపిస్తోంది. ఆమోదించిన బడ్జెట్‌కు, అమలు చేస్తున్న బడ్జెట్‌కు మధ్య పొంతన కనిపించడం లేదు. బడ్జెట్‌లో లేని వాటికి భారీగా వ్యయం చేస్తుండగా, ఉన్న వాటికి ఖర్చు చేయని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పలు శాఖల నిధులు ఇతర శాఖలకు దారిమళ్లినట్టేనని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అకౌంటెంట్ జనరల్ కార్యాలయం పరిశీలనలో ఇవే అరశాలు బయటపడినట్లు తెలిసింది. ఏకంగా వేల కోట్లలో ఇలా ఖర్చుల్లో అంతరాలు వెలుగుచూడడం గమనార్హం. కొన్ని ఖర్చులకు సంబంధించిన వివరాలు కూడా లేనట్లు స్పష్టమవుతోంది. తాజాగా వెలుగుచూసిన లెక్కల్లో ఏకంగా 64,475 కోట్ల రూపాయల వ్యయానికి అసలు బడ్జెట్‌లో కేటాయింపులే లేవని తేలింది. కేవలం 57 కేసుల్లోనే ఇరత నిధుల వివరాలు లేకపోవడం, ఆమోదం లేకుండానే ఖర్చు చేయడం సామాన్యమైన విషయం కాదని అధికారులు అంటున్నారు. ఇరదులో ఆర్థికశాఖ పరిధిలోని ద్రవ్య యాజమాన్యం, ప్రణాలిక కిందనే ఏకంగా రూ.63 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ మొత్తంలో ఒక్క రూపాయికి కూడా బడ్జెట్‌లో కేటాయింపులు లేవని స్పష్టమైంది. ఈ నిధులు దేనికి ఖర్చు చేసారన్నది కూడా అస్పష్టంగా ఉందని సమాచారం. అలాగే 638 కోట్లు హోంశాఖలో, రూ.144 కోట్లు పట్టణాభివృద్ధి శాఖలో, వంద కోట్ల వరకు మత్స్య శాఖలో, 244 కోట్ల వరకు ఐటి శాఖలో ఖర్చు జరిగింది. బడ్జెట్‌లో ఆమోదించినప్పటికీ కొన్ని శాఖల్లో ఖర్చు జరగని వైనం కూడా కనిపించింది. దీని విలువ ఏకంగా రూ.37 వేల కోట్ల వరకు ఉందని సమాచారం. ఆర్థికశాఖకు కేటాయించిన పలు పద్దుల్లో రూ.16,300 కోట్ల వరకు ఖర్చు జరగలేదు. ఇదే ఆర్థికశాఖలోని ద్రవ్య నిర్వహణ విభాగంలో రూ.62 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయడం, ఇదే విభాగంలోని మరికొన్ని పద్దుల్లో రూ.16 వేల కోట్లు ఖర్చు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే నిధుల వినియోగంలో దారి మళ్లింపు స్పష్టంగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బడ్జెట్‌లో జరిగిన కేటాయింపుల కన్నా కొన్ని రంగాల్లో రూ.5838 కోట్లు అదనంగా ఖర్చు చేసిన వైనం కూడా వెలుగుచూసింది. ఇరదులో కూడా ఆర్ధికశాఖ ద్రవ్య నిర్వహణకు జరిగిన కేటాయింపుల్లోనే రూ.2050 కోట్లు అదనంగా ఖర్చు కావడం విశేషం. వైద్య శాఖలో కూడా కేటాయింపుల కన్నా రూ.1724 కోట్లు అదనంగా ఖర్చు జరిగింది. వీటిపై అధ్యయనం చేసిన అకౌంటెట్ జనరల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు కోరినట్లు తెలిసింది.