చార్ ధమ్ యాత్రకు వెళ్లి బద్రీనాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. చార్థామ్ యాత్రకు వెళ్లిన వేలాది మంది అక్కడ భారీవర్షాలు కురవడంతో మార్గమధ్యలో చిక్కుకుపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మొత్తం 104 మంది చార్ ధామ్ యాత్రీకులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మంచు వర్షంతో అక్కడే చిక్కుకపోయారు. చుట్టూ మంచు ఉండడతో బయటకు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుడా అధికారులను అప్రమత్తం చేసారు. ఏపీ భవన్ అధికారులు బుధవారం నాడు చమోలీ ఎస్పీతో మాట్లాడారు. ప్రస్తుతం బద్రీనాథ్ లో వాతావరణం బాగానే ఉంది. యాత్రికులు జోషిమట్ వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం నాడు వాతావరణం బాగలేక పలు ప్రాంతాల్ల్ఓ వాహన రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించటంతో యాత్రికులు తిరుగు ప్రయాణమవుతున్నారు.