YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టాలీవుడ్,, స్పందించందా

టాలీవుడ్,, స్పందించందా

టాలీవుడ్,, స్పందించందా
హైదరాబాద్, నవంబర్ 25,
ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టం భారీ స్థాయిలో సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగానికి మొత్తం 1,354 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు. రహదారులు.... చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 1,42,862 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రహదారులు, కల్వర్టులు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. రహదారులు, కల్వర్టులకు 1,756 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ మేరకు ప్రాధమిక నష్టం అంచనా వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తాయి. ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది. వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పంటనష్టం వేల కోట్లలో ఉంది. పక్కా ఇల్లు కూడా  ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయం కోసం కోరింది. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీ నుంచే టాలివుడ్ కు... కానీ ఏపీలో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలకు వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి స్పందన కరువైందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. వరద బాధితులకు పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షలు పంపుతున్నట్లు ప్రకటించింది. ఏపీని నమ్ముకుని వెండితెరను ఏలుతున్న హీరోలు, నిర్మాతలు ఏపీ వరద బాధితుల సాయానికి ముందుకు వస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. టాలివుడ్ కు, ముఖ్యమంత్రి జగన్ కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉండటంతో ఈ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
కర్నూలులో  తీరని నష్టం
వర్షాలతో అన్నదాత నిండా మునిగిపోయాడు. చేతికాడికి వచ్చిన పంట నీటిపాలైంది. ఆరుకాలం కష్టించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో దొర్నిపాడు, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, చాగలమర్రి, హోళగుంద, కోసిగి, బండిఆత్మకూరు, కౌతాళం, ఆదోని మండలాల్లో పంట నష్టం అధికంగా ఉంది. కళ్లాల్లో ఆరబెట్టిన పంట పూర్తిగా తడిసిపోయింది. నందికొట్కూరు మండలంలో మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ముందస్తుగా రబీలో శనగ పంటను సాగు చేయగా అది కూడా వర్షం ధాటికి దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా 2,07,514 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,04,113 మంది రైతులు నష్టపోయారు. 1,24,370 ఎకరాల్లో శనగ పంటకు నష్టం వాటిల్లింది. 62,628 మంది రైతులు నష్టపోయారు. జిల్లాలో నవంబర్‌లో సాధారణ వర్షపాతం 27.6 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకూ 92 మిల్లీమీటర్లు నమోదైంది,ఖరీఫ్‌ సాగుకు సంబంధించి 23,284 మంది రైతులకు చెందిన 48,590 ఎకరాల వరి నేలకొరిగింది. 8,844 రైతులకు చెందిన 16,103 ఎకరాల మినుములు, 8,560 మంది రైతులకు చెందిన 16,472 ఎకరాల్లో జొన్న పంటలు దెబ్బతిన్నాయి. 248 మంది రైతులు సాగు చేసిన 1008 ఎకరాల్లో కంది, 368 మంది రైతులకు చెందిన 714 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 120 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లోని పత్తి, 61 మందికి చెందిన 103 ఎకరాల్లోని వేరుశనగ పంట దెబ్బతింది.

Related Posts