YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్నపై పోలీసుల ఫిర్యాదు

అయ్యన్నపై పోలీసుల ఫిర్యాదు

విశాఖపట్నం
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు ని అరెస్టు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత తెలిపారు.విశాఖ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తక్షణం బహిరంగంగా పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం పోలీసుల ను అవమానించడం సరికాదని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని, అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని గుర్తుచేశారు. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పోలీసుల సేవలను ప్రజలు హర్షిస్తున్నారు అని తెలియజేశారు.

Related Posts