హైదరాబాద్ , నవంబర్ 25,
సీఎం వైఎస్ జగన్ చెబితే వింటాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేందేంటూ ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయడమేంటిని ప్రశ్నించారు. తాను, వల్లభనేని వంశీ సెక్యూరిటీ తీసేసి వస్తామని.. చంద్రబాబు తీసేసి వస్తారా అంటూ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ కుటుంబం.. ఇంకా చంద్రబాబునే నమ్ముకుందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు నందమూరి కుటుంబంతో కలిసి ఉన్నామని.. విబేధాలతో బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకేం సంబంధం లేదంటూ తెలిపారు. ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై కొడాలి నాని గురువారం మీడియాతో మాట్లాడారు.జగన్ మోహన్ రెడ్డిని వేధించిన సోనియా గాంధీ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు అందరూ సర్వనాశనమైపోయారని కొడాలి నాని అన్నారు. వైఎస్ జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని.. ఇలాంటి వారి వేధింపులు ఏం చేయలేవన్నారు. భార్యను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం హేయనీయమని చంద్రబాబును విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండకు వెళుతూ మరణించారని.. ఆయన ప్రజా సేవే పరమావధిగా భావించారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి అంటూ విరుచుకుపడ్డారు. సింపతి, ఓట్ల కోసం తాపత్రాయపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్ల రామయ్య మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని వెల్లడించారు.