విజయవాడ, నవంబర్ 26,
ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ తీరు.. సింహాద్రి, ఆది.. సినిమాల తరహాలో ఉంటుంది అనుకుంటే చాగంటి ప్రవచనాల్లా చెప్పారంటూ టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు మండిపడ్డారు. నిజమే.. బాలకృష్ణలా.. భరతం పడతాం.. ఖబడ్దార్.. ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోం.. లాంటి స్పైసీ పదాలు బుడ్డోడి నోటి నుంచి ఒక్కటి కూడా రాలేదు. చాగంటిలానే సూక్తులు చెప్పి.. మమ అనిపించారు. మామూలుగా వేరే ఏదైనా విషయం అయితే.. ఇంతలా కాంట్రవర్సీ అయ్యేది కాదేమో. ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరి బాధితురాలు కావడం.. బాధించిన వాళ్లు ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అవడం వల్లే.. ఇంత రచ్చ.. పొలిటికల్ రగడ.జూనియర్ ఎన్టీయార్ అంటే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి చాలా భయం. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారు.. అంటూ టీడీపీ ప్రముఖులు ఎన్టీఆర్‌ను నేరుగా టార్గెట్ చేశారు. అది కూడా రెండు రోజుల తర్వాత టీడీపీ సీనియర్లు ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తం ఎపిసోడ్‌లో జూనియర్ రియాక్షన్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఎన్టీఆర్‌పై టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మొత్తం వీడియో మెసేజ్‌లో ఒక్కసారైనా.. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించకపోవడం దారుణమంటున్నారు. ఏదో స్పందించాలి కాబట్టి.. స్పందించారని పెదవి విరుస్తున్నారు. అటు, వైసీపీ శ్రేణులు సైతం జూనియర్‌ను సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఎన్టీఆర్...నువ్వు ఎంత స్పందించినా ఆ కుటుంబ సభ్యుడిగా వాళ్లు ఎప్పటికీ నిన్ను భావించరంటూ సెటైర్లు వేశారు. ట్రోల్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇలా.. ఒక్క వీడియోతోనే బాగా బద్నామ్ అయ్యారు జూనియర్. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు.. ఎన్టీఆర్ ఎంత చెబితే అంత. అయినా, వారిని గట్టిగా హెచ్చరించకుండా.. వారితో క్షమాపణలు చెప్పించకుండా.. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా.. ఎన్టీఆర్ వీడియోతో రక్తి కట్టించారని అంతా విమర్శిస్తున్నారు. అందుకే, వర్ల రామయ్య ఓ అడుగు ముందుకేసి.. మీ నాన్న సీతయ్య బతికుంటేనా? అంటూ ఎన్టీఆర్ పరువంతా తీసిపారేశారు. అటు, కొడాలి నాని మాత్రం ఎన్టీఆర్‌తో తమకెలాంటి సంబంధాలు లేవని.. ఒకప్పుడు తామంతా ఒకటే కానీ, ఇప్పుడు కాదన్నట్టు వివరణ ఇవ్వడం వెనుక జూనియర్ ఆదేశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు జూనియర్‌ను టార్గెట్ చేయడం.. వ్యూహాత్మకమే అంటున్నారు. ఎన్టీఆర్ గోడ మీది పిల్లి లాంటి వాడనే విషయం బట్టబయలు చేయడమే వీరి ఉద్దేశ్యమని భావిస్తున్నారు. జూనియర్‌ను నమ్ముకుంటే ఉపయోగం లేదని.. పార్టీ కోసం ఆయన చేసిందీ.. చేస్తున్నాదీ.. చేయబోయేదీ.. ఏమీ లేదు.. ఏమీ ఉందడు అని నందమూరి అభిమానులకు తెలిసొచ్చేలా చేస్తున్నారని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సమస్యలు రాకుండా చూసుకోవాలనే తాపత్రయంతోనే ఎన్టీఆర్ ఆ మేరకైనా స్పందించారని.. లేదంటే ఆ వీడియో కూడా వదిలే వారు కాదని అంటున్నారు. ఇలా ఎన్టీఆర్‌కు టీడీపీపై గానీ, నందమూరి కుటుంబం మీద కానీ.. అసలేమాత్రం ప్రేమాభిమానాలు లేవని తాజా ఎపిసోడ్‌తో తేలిపోయిందని టీడీపీ నేతలు, ప్రజలు క్లారిటీకి వచ్చేస్తున్నారు. అందుకే, జూనియర్‌ను నమ్ముకొని ఎలాంటి ప్రయోజనం లేదు. ఎన్టీఆర్ దండగ..అంటున్నారు.