విజయవాడ, నవంబర్ 26,
సీఎం జగన్‌రెడ్డిపై చిరంజీవి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ను సమర్థిస్తూనే.. టికెట్ ధరలు తగ్గించడాన్ని మాత్రం తప్పుబట్టారు. దేశమంతా ఓ లెక్క.. మీరు మరోలెక్క.. వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. సినీ పరిశ్రమకు మేలు చేయాలని.. థియేటర్ల మనుగడ కాపాడాలని.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ట్విట్టర్‌లో చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చాలా జాగ్రత్తగా.. బాగా ఆలోచించి.. ఏరికూరి పదాలు వాడుతూ.. సీఎం జగన్‌ను నేరుగా విమర్శించకుండా.. పరోక్షంగా ఆయన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టేలా.. మెగాస్టార్ వ్యూహాత్మకంగా ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది.పదాలు పాజిటివ్‌గా ఉన్నా.. మీనింగ్ మాత్రం జగన్‌ను మెయిన్‌గా టార్గెట్ చేస్తోంది. మెగాస్టార్ నుంచి ఇలాంటి ట్వీట్.. జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి ఊహించని షాక్ అనే చెబుతున్నారు. థియేటర్లపై ఇటీవల దూకుడుగా, టార్గెటెడ్‌గా వెళ్తున్న ఏపీ సర్కారుకు ఇన్నాళ్లూ వంతపాడుతూ వచ్చిన మెగాస్టార్.. సడెన్‌గా ప్రభుత్వ తప్పులను సుతిమెత్తగా, నేరుగా ఎత్తి చూపడం సంచలనంగా మారింది.జగన్‌రెడ్డి-చిరంజీవిల మధ్య ఇటీవల సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ దంపతులు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి మరీ జగన్ ఫ్యామిలీని కలిశారు. విందు భోజనం చేశారు. ఆ తర్వాత చిరంజీవితో సహా టాలీవుడ్ పెద్దలంతా పలుమార్లు సీఎం జగన్‌రెడ్డితో సమావేశమయ్యారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే విషయం బెడిసికొట్టింది. బయటకు చెప్పుకోలేకపోతున్నా.. జగన్ సర్కారు చేస్తున్న టార్చర్‌కు సినీ పరిశ్రమ విలవిల్లాడిపోతోందని అంటున్నారు. అందుకే, ఈమధ్య ఓ ఫంక్షన్‌లో.. సీఎం జగన్‌ను బహిరంగంగానే వేడుకున్నారు చిరంజీవి. ప్లీజ్.. దయచేసి.. పరిశ్రమను కాపాడండి.. మా విన్నపాలు నెరవేర్చండి అంటూ.. కాళ్ల మీద పడినంత పని చేశారు. ఓవైపు తమ్ముడు పవన్‌కల్యాణ్.. జగన్ ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నానికి తలంటుతుంటే.. అన్నయ్య మాత్రం ఇలా రిక్వెస్ట్ మోడ్‌లో విజ్ఞప్తులు చేస్తూ.. జగన్‌రెడ్డిపై నాటు-నీటుగా ఒత్తిడి పెంచారు. అయినా.. అన్నదమ్ముల ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కాలేదు. ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్‌తో పాటు బెనిఫిట్స్ షోలు రద్దు చేయడం.. టికెట్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించేలా.. సవరణ బిల్లు తీసుకురావడంతో.. టాలీవుడ్‌తో పాటు మెగా బ్రదర్స్ ఉలిక్కిపడ్డారు. త్వరలోనే ఇటు భీమ్లా నాయక్.. అటు ఆచార్య.. రిలీజ్ కాబోతున్నాయి. సర్కారు నిర్ణయం ఆ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. అందుకే, చిరంజీవి మరోసారి జగన్‌కు రిక్వెస్ట్ పంపించారు. మునపటిలా బాబ్బాబు.. అనే తరహాలో కాకుండా.. ఇది కరెక్ట్ కాదు.. టికెట్ ధరలు ప్రభుత్వమే నిర్ణయించడమేంటి? అదెలా కుదురుతుంది? ఇంత నష్టం జరుగుతుంది.. ఇన్ని కుటుంబాలు రోడ్డున పడుతాయి.. అనే పదాలు వాడకుండా.. అదే అర్థం వచ్చాలా.. నీట్‌గా ట్వీట్ చేశారు ఆచార్య. ఈ ట్వీట్‌ను బట్టి.. జగన్‌రెడ్డిని టాలీవుడ్ దోషిగా చూస్తోందని తేలిపోతోంది. అందుకే, చిరంజీవి ట్వీట్.. వైసీపీని షేక్ చేస్తోంది. మెగాస్టార్ రఫ్ఫాడించారంటూ ఇండస్ట్రీ విజిల్స్ వేస్తోంది. మరి, జగన్‌రెడ్డి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాలి...