హైదరాబాద్
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ట్రస్టెడ్ అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోకెల్ల గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని, రాజ్యాంగ రచయిత డా"బీ ఆర్ అంబేద్కర్ అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి భారత దేశానికి పటిష్ట రాజ్యాంగాన్ని రూపొందించారని,వారి కృషి వల్ల 140కోట్ల మంది హక్కులు పొందుతున్నారని పేర్కొన్నారు. మహనీయులు అంబేద్కర్ ను చిరస్మరణీయులని తెలిపారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఆక్ట్ పుస్తకం ను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చేతుల మీదగా ఆవిష్కరించారు.ట్రస్టెడ్ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా రావు, జనరల్ సెక్రటరీ సురెందర్ కుమార్ లను ఎమ్మెల్యే అభినందించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.