న్యూఢిల్లీ నవంబర్ 26
2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన దాడులకు నేటితో 13 ఏళ్లు నిండాయి. ఆ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవాలని ఇవాళ పాకిస్థాన్‌ను ఇండియా కోరింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. 26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసును త్వరగా విచారించాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ముంబై దాడులు జరిగే 13 ఏళ్లు గడిచినా.. 166 మంది బాధిత కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నట్లు భారత ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కేంద్ర విదేశాంగశాఖ ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని శిక్షించడంలో పాకిస్థాన్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ద్వంద్వ వైఖరిని పాకిస్థాన్ వీడాలని భారత్ కోరింది. 26/11 ముంబై దాడుల దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులు, అమరులకు న్యాయం చేకూరే వరకు భారత్ ప్రతి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందని విదేశాంగ శాఖ తెలిపింది.