కరీంనగర్, నవంబర్ 27,
2014 ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన నాయకత్వం లేదనే చెప్పాలి. కానీ తెలంగాణ సాధించిన రాష్ట్రంగా…2014 ఎన్నికల్లో టీఆర్ఎస్…ఎడ్జ్‌లో మెజారిటీ తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. ఇక ఇక్కడ నుంచి కేసీఆర్..రాజకీయ క్రీడ మొదలైంది. టీఆర్ఎస్‌ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్…ఇతర పార్టీలకు చెందిన నేతలని ఏ విధంలో టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేశారు. అసలు టీఆర్ఎస్‌లో సగం మంది టీడీపీ నాయకులే ఉన్నారు. ఇక అలా టీడీపీని తుడిచిపెట్టిన కేసీఆర్…రెండోసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు..ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని, నాయకులని సైతం టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ కూడా ఖతం అయ్యే స్థితికొచ్చేసింది. అయితే ఇలా ఇతర పార్టీనేతలతో టీఆర్ఎస్ బాగా ఫుల్ అయిపోయింది. ఇక నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. పదవుల పంపకాల విషయంలో తేడాలు వస్తే నేతలు అలకపాన్పు ఎక్కేస్తున్నారు.ఇదే సమయంలో బీజేపీకి బండి సంజయ్…కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షులు అయ్యాక పరిస్తితి మారింది. ఆ రెండు పార్టీలు పుంజుకుంటున్నాయి. దీంతో టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దక్కని నేతలు…నిదానంగా వేరే పార్టీలోకి జంప్ చేయడం స్టార్ట్ చేశారు. తాజాగా కారుకు వరుస పంక్చర్లు పడుతూ వస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టాయి.సీటు దక్కలేదని చెప్పి..కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్…టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి…ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలో దిగారు. ఈయనకు ఈటల రాజేందర్ మద్ధతు ఉందని తెలుస్తోంది. అలాగే ఖమ్మం జిల్లాలో చెందిన గట్టు రామచంద్రరావు సైతం..టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ ఆరేళ్లుగా కష్టపడుతున్నా సరే పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో గట్టు టీఆర్ఎస్‌ని వీడారు. అటు కొల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాశ్ రావ్ తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ జంపింగులు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.. టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కూడా గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తాను ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయాను… కేసీఆర్ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చు కోవడంలో విఫలమయ్యాను.ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని నేను భావించాను. అందుకే టీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను ఆమోదిస్తారని కేసీఆర్ గారిని కోరుతున్నారు. ఇన్ని రోజులు తనకు అన్ని బాధ్యతలు అప్పగించినందుకు గానూ పార్టీ నాయకత్వానికి ధన్య వాదాలు అంటూ లేఖ విడుదల చేశారు. అయితే.. తన భవిష్యత్తు కార్యచరణను మాత్రం గట్టు రామచంద్రరావు చెప్పాలేదు. అయితే… రామచంద్రరావు రాజీనామా పై టీఆర్‌ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.