YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ మాటిచ్చారు..మడమ తిప్పారు

కేసీఆర్ మాటిచ్చారు..మడమ తిప్పారు

కరీంనగర్
ఎమ్మెల్సీ టీ ఆర్ యస్ రెబల్ అభ్యర్థి, నగర మాజీ మేయర్  రవీందర్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో ఉద్యమ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ కాకుండా మెయింటనెన్స్ బ్యాచ్ కూడా మొదలయింది. నా నామినేషన్ తిరస్కరించే ప్రయత్నం జరిగింది. మద్దతిచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టె ప్రయత్నం చేశారు. రిటర్నింగ్ అధికారి 3 గంటలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నా నామినేషన్ చూసి టీ ఆర్ యస్ నాయకులు ఎందుకు భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. ఎన్నికల్లో పోటీలో ఉంటున్న అని తెలుపటానికే ఫోన్ స్విచ్  చేసాను.  అర్జున గుట్ట పుష్కరాల సాక్షిగా 15 ఏళ్ల క్రితం నాకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. మహబూబ్ నగర్ ఉపఎన్నికల్లో మాట ఇచ్చారు. నాయిని నరసింహ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ల ముందు మరోసారి మాట ఇచ్చారు. కరీంనగర్ మంత్రులు అవమానాలకు గురిచేస్తున్నారని అయన ఆరోపించారు.

కేసీఆర్ మాట నీటి మూట....
తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మాట నీటి మూట అయ్యింది. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు  తీర్పు ఇచ్చినక కూడా వందల వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.  డబ్బులు ఇచ్చిన వాళ్లకు తెరాస నేతలు టికెట్లు ఇస్తున్నారని  మాజీ ఆర్టీసి చైర్మెన్ మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ గా గెలిచిన తరువాత ఎవరు కూడా కనిపించారు అందుకని రవీందర్ సింగ్ కి ఓటు వేసి గెలిపించాలి. గిరిజన యువతి సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ విత్  డ్రా చేయించారు. భారత దేశం లో ఏ రాష్ట్రంలో కూడా 11 మంది విప్ లు లేరు. తెలంగాణ లో ఉన్నారు. సామాజిక న్యాయం కోసం అభ్యుదయ వాదానికి ఓటు వేయండని అయన కోరారు.

Related Posts