తిరుపతి
ఆంధ్రప్రదేశ్ లో వింత పరి స్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన చిత్తూరు జిల్లా తిరుపతిలో ఊహకు కూడా అందని ఘటనలు జరుగుతు న్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపో తున్నారు. ఇప్పటికే వరద సృష్టించిన విలయంతో తిరుపతి నగరం అతలా కుతలమైంది. వర్షాలు తగ్గి వరదల నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థి తులు నెలకొంటున్నాయి. విలయం నుంచి కోలుకుంటున్న తరుణంలోనే తిరుపతిలో చోటు చేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో భూమిలో వింత ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.భూమిలో నుం చి వాటర్ ట్యాంక్ బయటకు రావడం తో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వింత జరగడానికి కారణలేంటని జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.
తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికులు బెంబేలె త్తిపోయారు. ఎప్పుడు ఏ జరగుతుం దో తెలియక ఆందోళన చెందుతున్నా రు. ఇంకా జనం ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఊహించని పరిణామం ఎదురైంది. శ్రీకృష్ణనగర్లో వాటర్ ట్యాంక్ పైకి వచ్చిన ఇంటికి సమీపంలోని ఇంట్లో భూమి కుంగిం ది.కొన్ని ఇళ్లలో మెట్లు రెండు అడు గులు భూమిలోకి వెళ్లాయి అలాగే గోడల కింద భూమి కూడా కిందకు దిగింది. ఇంట్లో టైల్స్ కూడా పగిలి పోతున్నాయి.ఇలా దాదాపు 20 ఇళ్ల లో గోడలు బీటలువారడంతో పాటు అక్కడక్కడా కుంగాయి. దీంతో ఎప్పు డు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.