YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కిలేడీ....శిల్పా చౌదరీ కథ చాలా ఉంది

కిలేడీ....శిల్పా చౌదరీ కథ చాలా ఉంది

హైద్రాబాద్, నవంబర్ 27,
ప్రముఖుల పేర్లు చెప్పి పలువురు సెలబ్రిటీల వద్ద డబ్బులు తీసుకుని దాదాపు వంద కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టిన శిల్పా చౌదరి మోసాలకు చెందిన ప్రకంపనలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.శిల్ప చౌదరి అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ద్వారా తనకు స్థలాలు ఇప్పిస్తానని చెప్పి తన వద్ద కోటిన్నర రూపాయల వరకు తీసుకుందని, కానీ స్థలాలు చూపించకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తన ను విసిగిస్తోందని, గట్టిగా డబ్బులు అడిగితే బౌన్సర్ల తో బెదిరించిందని, తనకు శిల్పా చౌదరి తో ప్రాణ భయం ఉందని దివ్య రెడ్డి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ప్రాథమిక విచారణ జరిపి శిల్పా చౌదరి తో పాటు ఆవిడ భర్త శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరి అరెస్టు విషయం తెలుసుకున్న తర్వాత అనేక మంది ప్రముఖులు తాము కూడా శిల్ప చౌదరి చేతిలో మోసపోయాము అంటూ పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. శిల్ప చౌదరి హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రముఖులకు, పేజ్ త్రీ సెలబ్రిటీలకు తరచు పార్టీలు ఏర్పాటు చేస్తుంది. కిట్టి పార్టీల ద్వారా సెలబ్రిటీలను ఒక చోట చేర్చడం , వారి లో కొందరికేమో స్థలాలు ఇప్పిస్తామంటూ వారి వద్ద డబ్బులు తీసుకోవడం, మరి కొందరికి ఏమో, అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు తీసుకోవడం, ఇంకొందరికి వారి బ్లాక్ మనీ ఇస్తే కొంత వడ్డీ కలిపి వైట్ మనీ లాగా వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పడం, ఇలా రక రకాల విధాలుగా సెలబ్రిటీల నుండి డబ్బులు వసూలు చేసింది శిల్పా చౌదరి. అధిక వడ్డీ ఆశ, బ్లాక్ మనీ వైట్ అవుతుందనే ఉద్దేశం తో సినీ పరిశ్రమ వారు, లాయర్లు, ఫైనాన్షియర్ లు, వ్యాపారవేత్తలు పలువురు శిల్పా చౌదరికి భారీగా డబ్బులు సమర్పించుకున్నారు. అయితే ఇది వరకు కూడా వీరి లో కొందరు తమ డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని శిల్ప చౌదరి ని ఒత్తిడి చేస్తే, తన బౌన్సర్ లతో వీరిని బెదిరించడం, కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లు వాడుకుంటూ బెదిరింపులకు పాల్పడి వారు నోరెత్తకుండా చేయడం శిల్ప చౌదరి స్టైల్ అని బాధితులు చెబుతున్నారు. టాలీవుడ్ లో శిల్పా చౌదరి ప్రకంపనలు అయితే శిల్ప చౌదరి అరెస్టు విషయం తెలియగానే పలువురు బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. దివ్య రెడ్డి ఫిర్యాదు తర్వాత మరో పది మంది దాకా ఇప్పటికే శిల్ప చౌదరి పై ఫిర్యాదు చేశారు. అయితే వీరి లో సినీ ప్రముఖులు ఎవరు లేరు. శిల్ప చౌదరి చేతి లో మోస పోయిన సినీ ప్రముఖులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం. ఒక బడా నిర్మాత కొడుకు, మరొక బడా నిర్మాత కూతురు శిల్పా చౌదరి కి అత్యంత సన్నిహితులు అని తెలుస్తోంది. కొందరు సినీ ఫైనాన్షియర్ ల తో పాటు ఒక నిర్మాత కుటుంబ సభ్యులు కూడా శిల్ప చౌదరి కి భారీగా డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్ లో నేరు గా ఫిర్యాదు చేయకుండా తమ డబ్బులు తమ కు వచ్చేలా చేయమని పోలీసుల పై పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శిల్పా చౌదరి రియల్ ఎస్టేట్ మోసాలు వంద కోట్లకు పైగానే ఉంటాయని , సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు ఇతర రంగాల వారు పలువురు ఈమె బాధితుల లిస్టు లో ఉన్నారని, సమగ్ర విచారణ చేపడతామని పోలీసులు చెబుతున్నారు. ఏ ఏ సినీ ప్రముఖులు శిల్ప చౌదరి చేతిలో మోసపోయిన జాబితా లో ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Posts