YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

భారీ నష్టాల్లో పేటీఎం

భారీ నష్టాల్లో పేటీఎం

ముంబై, నవంబర్ 27,
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి నష్టాలను చవిచూసింది. కరోనా సమయంలో లాభాలను ఆర్జించినప్పటికీ ,అనుకూల పరిస్థితుల్లో ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేసిన అనంతరం పేటీఎంను నష్టాలు వెంటాడుతున్నాయి. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీగా నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ .481 కోట్ల 70 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ లో నిర్వహించిన వ్యాపార లావాదేవీల్లో ఈ మేర నష్టం వచ్చిననట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో రెండో త్రైమాసికానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించింది.వన్ 97 కమ్యూనికేషన్స్ నష్టపోవడం ఇది వరుసగా రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-మే-జూన్ మధ్య రూ. 376 కోట్ల 60 లక్షల మేర నష్టం సంభవించింది. రెండో త్రైమాసికంలోనూ నష్టాలు మరింతగా పెరిగాయి. రూ.481.70 కోట్లకు చేరుకున్నాయి.లిస్టింగ్‌ సమయంలోనే 1,950 రూపాయలను నమోదు చేయగా… అప్పటి నుంచి డౌన్ గ్రాఫ్‌లోనే కొనసాగుతున్నాయి పేటీఎం షేర్స్. ఒక దశలో రూ .1280 వరకు దిగజారింది. ఆ తరువాత కోలుకుంది. వరుసగా మూడు రోజుల పాటు అప్పర్ సర్కుట్‌లో ట్రేడ్ అవుతూ వచ్చింది. శుక్రవారం నాడు ముగిసిన ట్రేడింగ్ ప్రకారం..పేటీఎం ఒక్కో షేర్ ప్రైస్ 1,765 రూపాయలుగా నమోదయింది. షేర్ల ధరలు బెంచ్ మార్క్ ప్రైస్‌ను కనీసం కటాఫ్ రేటును కూడా అందుకోలేకపోతోంది. ఈ కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు షేర్లు పుంజుకొంటే గానీ కంపెనీ పరిస్థితి మెరుగు పడేలా లేదని అంటున్నారు.

Related Posts