మనిషి, ఆనందాన్నే ఎందుకు కోరుకుం టాడు? అది, అతని స్వభావం కనుక.సుఖ సంతోషా లకై అనుక్షణం ఎందుకు అర్రులు చాచుతుంటాడు. ఆరెండూశాశ్వతం కావని తెలియక. నిజానికి మాన వుడి సుఖ, సంతోష, ఆనందాలు వ్యక్తిగతం మాత్ర మే కావు. వ్యక్తి నుండి సమాజానికి; సమాజం నుం డీ సర్వప్రపంచానికి సంబంధించిన విషయాలివి.
ఒక వ్యక్తి సమాజం కాలేడు. ఒక యిల్లు గ్రా మం కాలేదు. ఒక వృక్షం వనం కాదు. ఒకడి ఆనం దం అందరి ఆనందం కాదు. అందరి ఆనందం ఒక రి ఆనందమై నిలుస్తుంది. సమగ్రత, సమన్వయం, సమత... యివన్నీ ఆనందం వైపు నిడిపిస్తయ్. . జాగ్రత్తగా గమనిస్తే, మనిషి తన కోసమే జీవి స్తాడు. ఇదే వాస్తవం. అందరూ ఆనందంగా ఉండా లని కోరుకుంటాడు ఇది ఆదర్శం. ఆచరణలో మని షి వెనుకబడిపోతాడు. కారణం స్వార్ధం, సంకుచి తత్వం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటం వెనుక తన ఆనందమే వున్నది కనుక, అది ఆదర్శం కాదు.
ఇంతకీ సుఖమంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువు, ఒక అనుకూలాన్ని కలిగిస్తే అది సుఖం. అటువంటి సుఖం, వస్తువుతో ముడి పడి ఉంది. వస్తువు తన నుండీ దూరమైనా, తాను వస్తువు నుండి దూరమైనా సుఖమూ దూరమౌ తుంది. అంటే దుఃఖం కలుగుతుంది. అంటే పోతు న్న సుఖానికి, వస్తున్న దుఃఖానికి కారణం వస్తువే అవుతున్నది. కనుక సుఖదుఃఖాలు రెండూ స్తితులే. మారుతూ ఉంటయ్ కనుక అవి అశాశ్వతాలు. చలచ్చలితాలు. ఆ కారణంగా సుఖమూ ఒక ఎండ మావే! దాని మూలం దుఃఖం పోవటంతో వున్నది. కనుక, నిరంతరమూ మారుతుండే ఈ రెండు సితులూ అనుభవాన్నే మిగుల్చుతయ్. ఆపై అంతా మరపే. స్మృతి నీటి మీదరాతే. కాలం మీద గీతే!
ఇక సంతోషం! పొందాలనుకున్న దానిని పొందినపుడు పొందే భావోద్వేగమే సంతోషం. ఇదీ వస్తు మూలకమే. ఒక వస్తువు నాకే చెందాలన్న అహంకారం, నాదే కావాలన్న మమకారం, ఆ వస్తు వును పొందటంతో అహం శాంతించి, మమకారం అతిశయించినపుడు కలిగిన యింద్రియపరమైన తృప్తే సంతోషం. దీనికి శాశ్వతత్వం లేదు. సంతోషం లో ఎన్నో స్థాయిలున్నయ్. పరిమితులు న్నయ్. వస్తువుతో ముడిపడి వున్నందున, వస్తువు పోతుం దేమోనన్న భయం, అభద్రత, పోతే మనుగడేమై పోతుందోనన్న బాధ, అశాంతిని కలిగిస్తయ్. కనుక సంతోషం మనోమూలకమై, క్షణికమై వుంటుంది. సుఖం దేహపరం; సంతోషం మనోపరం!
ఈ రెండింటినీ ఒకటే అనుకుని, అవే శాశ్వత మని భావించి మనిషి ఎన్నో సార్లు మోసపోతుం టాడు. ఓడిపోతుంటాడు. శరీరం - మనసుల మధ్య, నిత్య సంఘర్షణ ప్రారంభమై, భరింపరాని దుఃఖంగా మారుతుంది. నిజానికి, కష్టమే కర్మనిష. కర్మానుష్ఠానం వలన జీవితం స్పష్టంగా అర్థమై, మనసు నెమ్మదిం చి, ఆనందం వైపు మరలుతుంది.
ఆనందమంటే మార్పెరుగనిది. ఉద్వేగమెరుగనిది. తాద్యాత్మ్య మెరుగనిది. అదొక ఆత్మ నిష్ట ఈ ఆనందం పలు స్థాయిలలో అనుభవంలోకి వస్తుంది. - ఒకవ్యక్తికి తన సుఖసంతోషాలపరిధిని దాటి, వస్తువుల పరిమిత ఆవరణాన్ని దాటి ఉండగలిగితే అది మనుష్యానందం.
తాను పొందిన ఆనందాన్ని మరొకరితో పంచుకోగలిగిన ఔదార్యం కలిగినపు డు, మనుష్యానందమే మనీషానందంగా మారి, ఆనంద పరిధిని పెంచుతుంది. మనీషానందం ఏ కొందరికో మాత్రమే కాక, మరింత విస్తృతానుభ వాన్ని సంతరించుకోవలసి వచ్చినపుడు ఆ ఆనందానికి కొంత చేతనను జోడించి, పవిత్రీకరిం చి, మానవీయతను అది, అనుభవించగలిగితే అది గంధర్వానందమౌతుంది.
గాంధర్వమంటే సహజ ప్రజ్ఞ . ఎక్కడో ఒక ఆనందభావనగా ప్రారంభమైనది, ప్రజ్ఞను కలుపు కున్నప్పుడు స్పష్టతను సంతరించుకుంటుంది. ప్రజ్ఞ లేని మానవుడు లేడు. ప్రాథమికమై, పరిమిత మైన ఆవరణంతో ప్రజ్వరిల్లే ప్రజ్ఞ, గంధర్వానం దంతో కలిసినపుడు, అది మానవగం ధర్వానంద మౌతున్నది. సంస్కారము, సంస్కృతి, నిబద్ధత వంటి ఉదాత్త భావనలతో కూడిన ప్రజ్ఞ, మానవ గంధర్వా నందాన్ని దేవగంధర్వానం దంగా అనుభవంలోకి తెస్తుంది . ఈ ప్రపంచమంతా సమాజపరమైనపుడు, ఆనందం ప్రజాపితానం దంగా మారుతుంది. ఈ సితిలోనూ కర్తృత్వం ఉం టుంది. చేస్తున్నవాడు, చేయబడుతున్న పని, దాని వలన కలిగే ఫలితం ఇంకా ఉండనే వున్నయ్. కాక పోతే సుఖ, సంతోష, ఆనందదాయకంగా వున్న య్. తన ఉనికి, వ్యక్తిత్వం , ప్ర, కార్యనిష, వీటివ లన లబ్ది పొందుతున్న ప్రపంచం, వీటన్నింటికి మూలమైన 'తాను' మరలిపోయి, అసలు 'తాను' మిగిలి, ఆ అనుభవమూ నశించి, సర్వమూ బ్రహ్మ మేనన్న స్థితిలో ఆనంద బిందువు, హిరణ్యగర్బా నంద సింధువై, అమందానందమై నిలకడ చెందు తుంది. ఈ హిరణ్యగర్బానందం, సముద్రం మధ్య లో వున్న సిమితం వంటిది. అంతెరుగని, అలలెరు గని, కదలికలలెరుగని, అచల మహాస్తితి యిది. సముద్రం అంచులలో లోతెక్కడ? మూలాన్వే షణలో లభించిన ఆనందమే శాశ్వతం! పైపైన లభించేదంతా అశాశ్వత సుఖదుఃఖాలే. ఆనందం మన స్వభావం! అందుకై దాన్ని కోరుకుంటాం.
యోగంలో చరమస్థాయి యోగానందమే, భోగంలో చివరి స్థాయి, భోగానందమే,సంయోగంలో వున్నదంతా ప్రాపంచికానం దమే, విషయంలో వున్నదంతా పరిమితానం దమేమనిషి మనసు, విశ్వాత్మతో కూడినపుడు, ఆ కలయిక సిరమైతే కలిగే ఆనందమే అసలు అనందం. అదే బ్రహ్మానందం. పరమానందం. ఆత్మానందం!