చిత్తూరు నవంబర్ 29
వరద పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టలేదు, ఇంకా కొన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాల లోనే ఉండాలని, ఇళ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం చిత్తూరు జైహింద్ స్కూల్ లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఈరోజు ఉదయం తీసుకున్న ఆహార వివరాలను గురించి ప్రశ్నించారు. తమకు ఆహారం గురించి ఇబ్బంది లేదని, మంచి ఆహారాన్ని నాణ్యతగల ది అందిస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు, వైద్య శిబిరం ఉంటున్నాయని తెలిపారు. మంచినీటి పరిస్థితి టాయిలెట్ల గురించి ప్రశ్నించారు. కొంత మంది బాధితులు తమ ఇళ్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతంలో కొంత గస్తీ ని ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే అందుకు సంబంధించి కలెక్టర్ ఎస్పీ తో మాట్లాడి పట్టణంలోని బాధితులు ఇల్లు ఉన్న తేనె బండ, వీరభద్ర కాలనీ, కైలాసపురం ప్రాంతాలలో గస్తీ ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థకు వారిని ఆదేశించారు. పునరావాస కేంద్రంలో ఉన్న పలువురు మహిళలు బాధితులు ఏర్పాట్ల గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు.