నల్గోండ
పర్యాటకులు,ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్. కృష్ణా నదిలో బోటింగ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో.. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకి వెళ్లే లాంచ్ ను ప్రారంభించారు తెలంగాణ టూరిజం అధికారులు. కోవిడ్ నిబంధనలతో పాటు.. ప్రయాణికుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. టూర్ అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరికి ఫుల్ టికెట్ 2,500.. ఆఫ్ టికెట్ 2,000 ఛార్జ్ ఫిక్స్ చేశారు. ఇక చాలా రోజుల తర్వాత బోటింగ్ ప్రయాణం చేస్తుండడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తీరా బోటు బయలుదేరే ముందు ఫారెస్ట్ సిబ్బంది వచ్చి.. బోటు కదలడానికి వీలు లేదంటూ లేవంటూ కొద్దిసేపు హడావిడి చేశారు. ఏకంగా టూరిజం ఎండి జోక్యం చేసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడటంతో యధావిధిగా బోటు కాస్త ఆలస్యంగా బయలుదేరింది.