YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు  ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తాం            సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. 3 రోజులపాటు మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశం వివరాలను చాడ బుదవారం మీడియా సమావేశం లో వివరించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ఉద్యోగులు, యువకులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నాయ ని చెప్పారు.రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని చాడ ఆరోపించారు.రాష్ట్రంలో పాలనఅధ్వాన్నంగా ఉందని విమర్శించారు.తెరాస అనుబంధ సంస్థ టీఎంయూబస్ భవన్ ముట్టడి చేపట్టడాన్ని బట్టిచూస్తే.. రాష్ట్రంలో పాలన తీరును అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ తన ఇష్టానుసారం పాత కేసులను తిరగదోడుతున్నారనివిమర్శించారు. ఓటుకు నోటు కేసుకూడాఅలాంటిదేనన్నారు. నయీం కేసుకు ఎంతో ప్రచారం కల్పించిచివరకు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మార్చివేశారన్నారు. కేసులనుప్రభుత్వమే నీరుగారుస్తోందనిమండిపడ్డారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంపై ఇతర పార్టీలతో చర్చిస్తున్నట్లు చాడ వెంకటరెడ్డితెలిపారు.ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘమే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని, టీఎంయూ నేతృత్వంలోనే బస్‌భవన్‌ను ముట్టడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. జూన్‌ 2న అమరవీరుల ఆకాంక్ష దినం జరుపుతామని, గద్దర్, విమలక్కతో సహా కళాకారులతో ఆటపాటలు, ధూంధాం నిర్వహిస్తామన్నారు .

Related Posts