YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేనానికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు

జనసేనానికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు

ఏలూరు, నవంబర్ 30,
పశ్చిమలో ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధి చెందిన ఆ నియోజకవర్గంకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేయడంలో అంతర్యం ఏంటి..? కీలక పదవులు ఆ నియోజకవర్గం నాయకులకు కట్టబెట్టడం పై ముఖ్య మంత్రి రాజకీయ ఎత్తుగడ ఏంటి..? 2024 ఎన్నికలలో ఆ నాయకుడికి చెక్ పెట్టేందుకే ఒకే నియోజకవర్గంలోని అన్ని వర్గాల నాయకులకు కీలక పదవులు కట్టబెడుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు స్ధానిక ప్రజలు. ఇప్పటి వరకు మండలి ఛైర్మన్ సహా డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులతో పాటు రానున్న మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే గ్రంథికి చోటు అనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో చెక్ పెట్టేందుకేనా అనే చర్చ సాగుతోంది.పశ్చిమగోదావరి జిల్లాలో లాస్ వేగాస్.. రెండో బార్డోలీగా పిలవబడే భీమవరం నియోజకవర్గం రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. పూర్వం నుండి ఇక్కడ గెలిచిన పార్టీ రాష్టలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. పూర్వం నుండి రెండు అగ్ర వర్ణాలు నాయకులూ ఇక్కడ రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. వీరి మాధ్య పోటీ నెలకొనేది అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి ఎన్నికల బరిలో నిలబడటంతో రాష్ట ప్రజల దృష్టి అంతా భీమవరం పైనే పడింది.వైసీపీ నుండి గ్రంధి శ్రీనివాస్ బరిలో దిగగా ఒకే సామాజిక వర్గం మధ్య పోరు రస వత్తరంగా సాగడంతో ఎస్సీ , బీసీ వర్గాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయడంతో పవన్ కళ్యాణ్ పై గ్రంధి శ్రీను గెలుపొందారు. మరలా పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భీమవరం ఎన్నికలలో వైసీపీకి అండగా నిలిచినా బీసీ, ఎస్సీ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు వైసీపీ ఆయా వర్గాల నాయకులకు కీలక పదవులు కట్టబెడుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయిఅంతేకాక భీమవరం ఎమ్మెల్యే గా పవన్ కళ్యాణ్ పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కుతుందా అని నియోజక ప్రజలలో ఆశక్తి పెరిగింది. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ,డిసిసిబి చైర్మన్ .పివియల్ నర్సింహరాజు,  వేండ్ర వెంకటస్వామి.. క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్..పాతపాటి సర్రాజు శాసన మండలి చైర్మన్ .కొయ్యే మోషేన్ రాజు ల కీలకమైన పదవులు లభించాయి.భీమవరం నాయకులకు కట్టబెట్టడంలో ఆంతర్యం అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకుని పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టేందుకే అనే స్ధానికంగా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టడానికే ఇంతమందికి పదవులా..? ఇంతకీ పవన్ కళ్యాణ్ పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కుతుందా..? అన్న అనుమానాలు నియోజకవర్గంలో ఓ సామజిక వర్గంలోని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్‌కు వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టేందుకే నియోజకవర్గం లోని అన్ని సామజిక వర్గాల ను తమ వైపు తిప్పుకునేందుకు అందరి నాయకులకు కీలక పదవులు వైసీపీ కట్టబెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

Related Posts