విజయవాడ, నవంబర్ 30,
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.ఆయనే కాదు, ఆయన కుటుంబం, తాత రాజారెడ్డి కాలంనుంచి కూడా క్రైస్తవ మత ఆచారాలనే పాటిస్తున్నారు. ఇదేమి రహస్యం కాదు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో కార్యక్రమాలన్నీ క్రైస్తవ సంప్రదాయాలు, ఆచారా ప్రకారమే నిర్వహించడం కొత్త విషయం కాదు. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే ప్రకారమే కుటుంబ సభ్యులు, అభిమానులు బైబిల్ పట్టుకొని ప్రార్ధనలు చేయడం, నివాళులు అర్పించడం అందరికీ తెలిసిందే. చివరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి, స్వర్ణలత రెడ్డి కూడా, హిందువే అయినా వైఎస్ జయంతి సందర్భంగా బైబిల్ పట్టుకొని ఏసుక్రీస్తు ప్రార్ధన చేశారు. వీడియో క్లిప్పింగ్ అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాడేపల్లి ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెచ్చిన ఆరు గోవులతో రాత్రికి రాత్రి గోశాలవెలిసింది. ఇదేమిటి, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఇష్టంగానో, అయిష్టంగానో, లేక ఆయన తల్లిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా రాజకీయాల కోసమో, హిందూ దేవాలయకు వెళ్ళడం, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం చేసినా అదొక పద్దతి. కానీ, ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలో రాత్రికి రాత్రి గోశాలను ఏర్పాటు చేయడం ఏమిటీ? ఇంతవరకు ప్రోటోకాల్ కోసమే అయినా ఏడుకొండల గడప అయిన తొక్కని, ఆయన సతీమణి భారతి గోవులకు పూజ చేయడం ఏమిటి? ఇలా అకస్మాత్తుగా ముఖ్యమంత్రి దంపతులలో, హిందువులు పూజించే గోమాత పాతాళ భక్తి పొంగిపొరలడం ఏమిటి? దీనిపై ఇప్పుడు వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే, ఇందుకు కారణం ఉందని, స్వామీజీ సూచనల మేరకే ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో గోశాల ఏర్పాటు జరిగిందని అనటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీలు, ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణానికి కేటాయించడంపై, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వావాన్ని సీరియస్’గా హెచ్చరించింది. ఈ నేపధ్యలో, అసలు భాగోతం ఎక్కడ బయటకు వస్తుందో, హిందువులలో ఇప్పటికే వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ భగ్గుమంటుందో అనే ముందు చూపుతో .. గోశాల వేలిసిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి, శారద శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిసూచన మేరకు హిందూ మతంస్వీకరించారనే ప్రచారం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆలయాలపై జరిగిన వరస దాడుల హిందువుల మనోభావాలను దెబ్బతీసి వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచన మేరకే హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. ఇప్పుడు కూడా,స్వామీజీ సూచన మేరకే గోశాలఏర్పాటు చేశారని అంటున్నారు