YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరికి ప్రత్యామ్నాయాలు

వరికి ప్రత్యామ్నాయాలు

హైదరాబాద్, నవంబర్ 30,
తెలంగాణలో వరిధాన్యం అధికార, విపక్షాల మధ్య మంటపెట్టాయి. వరిసాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. యాసంగిలో వరిసాగు అంశంపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతోంది. అయితే ఇటీవల యాసంగిలో పండే బాయిల్డ్ రైస్ ను కొనమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగిలో వరిసాగు చేయవద్దని రైతులను కోరింది. ఇదిలా ఉంటే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి సారించింది. రైతులు ఏ పంటలను వేయాలనే దాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నేడు జరుగుతున్న కేబినెట్ భేటీలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే వరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ వ్యవసాయ శాఖ కొన్ని పంటను సిఫారసు చేస్తోంది. వరికి బదులుగా పెసర, సన్ ఫ్లవర్, వేరుశనగ, శనగ, మినుమలు, నువ్వులు సాగు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ చెబుతోంది. ఏవైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉండే ఏఈఓలను సంప్రదించాలని తెలిపింది. కాగా సన్ ఫ్లవర్ కు తప్పా.. అన్ని పంటలకు సంబంధించిని విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు విత్తనాభివ్రుద్ధి శాఖ తెలిపింది. మరోొవైపు రైతులను పామాయిల్ పంటల వైపు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Related Posts