YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నాలుగేళ్ల మెట్రో

నాలుగేళ్ల మెట్రో

హైదరాబాద్, నవంబర్ 30,
హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం 69.2 కి.మీ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం, ఎంజీబీఎస్-జేబీఎస్ కారిడార్ల మధ్య మెట్రో కూత పెడుతోంది.మెట్రో రైలు ద్వారా సగటున రోజూ 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కరోనా సమయంలో 169 రోజులు మెట్రోరైళ్లు డిపోలకే పరిమితం కాగా.. ఆ తర్వాత ప్రారంభమైనా ప్రయాణికుల సంఖ్య అప్పటి మాదిరిగా లేదు. దీంతో మెట్రో సంస్థ నష్టాల్లో ఉందని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండటంతో మెట్రోకు ఆదరణ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఐటీ కార్యాలయాలు పనిచేస్తుంటే.. రోజుకు లక్షన్నర మంది ఐటీ ఉద్యోగులు మెట్రో ద్వారా ప్రయాణించేవారని వారు అంచనా వేస్తున్నారు. నష్టాలను తగ్గించుకునేందుకు ఇటీవల మెట్రో రైలు సమాయాలను కూడా అధికారులు పెంచారు. ఉదయం 6 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం కాగా… రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైల్ నడిపేలా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ మెట్రోరైలు ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక కన్‌స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డు-2021ని సొంతం చేసుకుంది.

Related Posts