YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒకే రోజు వందమందికి చెక్కులు పంపిణి చేసిన మంత్రి పద్మారావు

ఒకే రోజు వందమందికి చెక్కులు పంపిణి చేసిన మంత్రి పద్మారావు

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖల మంత్రి టీ.పద్మారావు గౌడ్ బుధవారం మరో విభిన్న రికార్డు ను నెలకొల్పారు.  ఒకే రోజు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 100 మందికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. దాదాపు రూ. 73 లక్షలకు పైగా విలువజేసే ఈ చెక్కుల పంపిణి కార్యక్రమం నామాలగుండు లోని తన కార్యాలయంలో కార్పోరేటర్లు  సామల హేమ, ఆలకుంట సరస్వతి, భార్గవి, విజయకుమారి లతో పటు ముషీరాబాద్  ఎమ్మార్వో  శైలజ, మారేడుపల్లి ఎమ్మార్వో సుగుణ, అధికారులు, నాయకులతో కలిసి నిర్వహించారు. బౌద్ధనగర్ కు చెందిన 17, తార్నాక కు చెందిన 16, అడ్డగుట్ట కు చెందిన 40, మేట్టుగూడ కు చెందిన 13, సీతాఫల్ మందికి చెందిన 14 మంది లబ్దిదారులకు ఈ  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందిచారు. నిజానికి లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి ఈ చెక్కులను అందించే పద్దతిని మంత్రి పద్మారావు గౌడ్ పాటిస్తున్నారు. ఇక ప్రభుత్వ పధకాలు నిరుపేదలకు సవ్యంగా లభించేలా పకడ్బంది ఏర్పాట్లు జరుపుతున్నామని మంత్రి పద్మారావు ఈ సందర్బంగా వివరించారు. దళారీల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. పేద ప్రజలకు మేలు చేకుర్చేలా తగిన పధకాల ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కెసిఆర్ కె దక్కిందని తెలిపారు. ఇక నుంచి అందించే  షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నిధుల మొత్తాన్ని రూ. లక్షకు పెంచినట్లు పెర్కోన్నారు.

Related Posts