మేడ్చల్
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం అధికారిక కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్ లకు సమాచారం ఇవ్వకుండా అంతా మేమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చైర్మన్ కమిషనర్ పై నిరసన వ్యక్తం చేసారు. నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్ లపై చిన్న చూపు చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఛైర్మెన్ ఒంటెద్దు పోకడలతో కౌన్సిలర్ లు చాలా అవమానాన్ని ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని అయన వాపోయారు. మున్సిపల్ కౌన్సిలర్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, మా కౌన్సిల్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మేము టిఆర్ఎస్ పార్టీ లో ఉన్న మాకు ఈ అవమానాలు పడుతున్నామని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.