మెదక్
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్ - అఖోల 161వ. జాతీయ రహదారి పై రైతులు రాస్తారోకోక దిగారు. ఆదే సమయంలో అటు వైపుగా వస్తున్న మంత్రి హరీష్ రావు కాన్వాయిని అపి రైతులతో మాట్లాడారు. రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోళల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వరి దాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.