హుజూరాబాద్..
ప్రేమించి పెళ్లి చేసుకొని మొహం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య అయిదు రోజులుగా చలిలో సైతం ఆందోళన చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో చోటు చేసుకుంది . ఆంద్రప్రదేశ్ రాష్ట్రాo కడప జిల్లాకు చెందిన సుహాసిని కి హుజురాబాద్ కి చెందిన నరహరి సుజిత్ రెడ్డి ఆన్లైన్ లో పరిచయం కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజులు కాపురం చేసి మొహం చాటేశారు. ఆమెను పట్టించుకోకుండా తిరుగుతుండటంతో ఆమె హుజురాబాద్ విద్యానగర్ లొని సుజిత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకి దిగింది. విషయం తెలుసుకున్న సుజిత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. కాగా ఆమెను చంపుతామని బెదిరించారని ఆరోపిస్తోంది. మాట్లాడుదాం అని పిలిసి తనను తన భర్త, అత్త, మరిది కొట్టి తాళి గుంజుకొని బైట కు వెళ్లగొట్టారని నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరాహారదీక్ష చేస్తానని తెలిపారు. నరహరి సుజిత్ రెడ్డి హన్మకొండలోని ఆదిత్య హాస్పిటల్ లొ మార్కెటింగ్ లొ పనిచేస్తాడు. అయిదు రోజులుగా బాధితురాలిని చుట్టు పక్కలవారు అన్ని రకాలుగా అదుకుంటున్నారు.