తిరుపతి
తిరుపతిలోని డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ సందర్శించారు. డాలర్ శేషాద్రి భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాలర్ శేషాద్రి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీం కోర్టు సీజే తో పాటు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు కూడా ఉన్నారు.