YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూన్ తర్వాతే విస్తరణ

జూన్ తర్వాతే విస్తరణ

విజయవాడ, డిసెంబర్ 1,
జగన్ పదవి చేపట్టి రెండున్నరేళ్లయింది. మంత్రి పదవులు ఇచ్చినప్పుడే అందరికీ రెండున్నరేళ్లే పదవి కాలం అని చెప్పారు. ఇప్పుడు రెండున్నరేళ్లయింది. మామూలుగా అయితే కొత్త టీమ్ వర్క్ ప్రారంభించాల్సి ఉంది. కానీ జగన్ ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్గతంగా ఏమైనా తీసుకున్నారేమో స్పష్టతలేదు. తీసుకుంటే మాత్రం నేడో రేపో లేకపోతే గవర్నర్ ఆస్పత్రి నుంచి రాగానే కొత్త టీం ప్రమాణస్వీకారం చేస్తుంది. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదని… వైసీపీలోని కొంత మంది ముఖ్యులు కూడా తమ నేతలకు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులకు మరో ఆరు నెలల పొడిగింపు ఇచ్చారని అంటున్నారు. కొద్ది రోజుల కిందట మంత్రి వర్గ సమావేశంలోనే జగన్ కేబినెట్ ప్రక్షాళన గురించి చెప్పారు. వంద శాతం మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని మీడియాకు కూడా లీక్ చేయాలని మంత్రి బాలినేనికి కూడా సూచనలు ఇచ్చారు. ఆ ప్రకారం ఆయన మీడియాకు కూడా లీక్ చేశారు. కానీ ఇప్పుడు కసరత్తు ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం స్పష్టత లేదు. నలుగురు ఐదుగురు మంత్రులు వివాదాల్లో ఇరుక్కున వారిని పక్కన పెడితే… హైకమాండ్ ఏది చెబితే అది చేయడానికి వెనుకాడని వీర విధేయ మంత్రులు ఉన్నారు. దేనికంటే దేనికైనా సరే వెనుకాడబోమని చెబుతున్నారు. వారి విధేయతను కాదనగలమా అన్న అనుమానం వైసీపీ పెద్దల్లో ఉంది. అలాగే సీనియర్లను కూడా పక్కన పెట్టలేని పరిస్థితి. అలా అని కొంత మందిని ఉంచి కొంత మందిని తీసేస్తే తేడా వస్తుంది. ఈ సమీకరణాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి సీఎం జగన్ మరో ఆరు నెలల సమయం తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయనకు రాత్రికి రాత్రి మార్చేయాలని అనిపిస్తే.. తర్వాత రోజు ఉదయం మారిపోతుంది. అందులో సందేహం లేదు. ఇప్పటికైతే.. ఆ ఆలోచన లేదని.. అందుకే రెండున్నరేళ్లు గడిచినా …సైలెంట్‌గానే ఉన్నారని అంటున్నారు.

Related Posts