న్యూ ఢిల్లీ డిసెంబర్ 1
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు నేటి నుంచే (బుధవారం) అమల్లోకి వచ్చాయని వెల్లడించాయి. తాజా పెంపుతో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,101కి చేరింది.అయితే, 14.2 కేజీ, 5 కేజీ, 10 కేజీ కమర్షియల్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. అదేవిధంగా ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా ఎటువంటి మార్పు చేయలేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. కాగా, నవంబరు 1న కూడా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.266 పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 1న రూ.75 పెంచారు.