అమలాపురం
ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహార సదుపాయాలను కాంట్రాక్టర్లు నిలిపివేసారు. అమలాపురం ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఫుడ్ కాంట్రాక్టర్లకు లక్షలాది రూపాయిల మేర బిల్లులను వైద్య ఆరోగ్య శాఖ చెల్లించాల్సి ఉంది. విసుగు చెంది ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ లకు ముందస్తునోటీసు అందించి గడువు తీరిన తరువాత ఆసుపత్రిలోని రోగులకు ఆహార సదుపాయం నిలిపివేశారు. అమలాపురంలో ఉన్న వంద పడకల ఏరియా ఆసుపత్రిలో వివిద రకాల రోగులకు ఉదయం, సాయంత్రం బోజన సదుపాయం కల్పించేవారు. గత 19 నెలలుగా బిల్లులు చెల్లించడంలేదు. ఇప్పటికే విషయాన్ని కాంట్రాక్టర్లు అధికారులతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహించే అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజన వసతులు నిలిపి వేయడంపై అటు రోగులు,ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం పరియా ఆసుపత్రిలో సుమారు రూ.12 లక్షల మేర బిల్లు పెన్డింగ్ లో ఉన్నాయని నిర్వాహకుడుచెబుతున్నాడు. ముందస్తుగా సూపరింటెండెంట్ కు నోటీసు ఇచ్చామని, అనివార్య పరిస్థితుల్లో నిలుపుదల చేయాల్సి వచ్చిందంటూననారు. ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.