YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

జీఎస్టీతో పెట్రో ఉత్పత్తులకు కల్లెం

జీఎస్టీతో  పెట్రో ఉత్పత్తులకు కల్లెం

ముంబై, డిసెంబర్ 2,
పెట్రోల్‌, డీజిల్‌ జిఎస్‌టి పరిధిలోకి వస్తే వాటి ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.20 నుంచి 25 వరకు తగ్గుతాయి. అయితే దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్, డీజిల్‌పై వచ్చే పన్ను మాత్రమే. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ మరోసారి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కరోనా ఇంకా ముగియలేదని కౌన్సిల్ చెబుతోంది అందుకే రానున్న రోజుల్లో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళన నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.8 తగ్గనుంది. ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన తర్వాత ఢిల్లీ-NCRలో చౌకైన పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకటనకు ముందు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.01 ఉంది. ఇప్పుడు లీటర్‌పై రూ.8 తగ్గిన తర్వాత రూ.96.01 పలుకుతోంది. గత కొద్దిరోజులుగా వచ్చిన నివేదికల ప్రకారం.. పెట్రోలు, డీజిల్‌ GST పరిధిలోకి వచ్చిన తర్వాత, పెట్రోల్ దాదాపు 20-25 రూపాయల వరకు డీజిల్ దాదాపు 20 రూపాయల వరకు తగ్గుతుందిఇది జరిగిన వెంటనే అన్నింటికంటే ముందుగా రాష్ట్రాలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇప్పటివరకు డీజిల్-పెట్రోలు GST పరిధిలోకి తీసుకురాలేదు. ఎందుకంటే ఏ రాష్ట్రం నష్టపోవాలని కోరుకోదు కదా.. రాష్ట్రాల ఆదాయంలో ఎక్కువ భాగం డీజిల్-పెట్రోల్‌పై విధించే పన్ను ద్వారానే వస్తుంది కాబట్టి పెట్రోల్-డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా దాదాపు రూ.లక్ష కోట్లు నష్టం. అంటే జీడీపీలో 0.4 శాతానికి సమానం.2019లో పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.19.98 కాగా, డీజిల్‌పై లీటరుకు రూ.15.83. గత ఏడాది ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రెండుసార్లు పెంచింది. దీని కారణంగా లీటర్ పెట్రోల్‌పై రూ.32.98, డీజిల్‌పై రూ.31.83 పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్రోల్‌పై సుంకాన్ని లీటర్‌కు రూ.32.90కి, డీజిల్‌పై లీటర్‌పై రూ.31.80కి తగ్గించారు. ఈ నెలలో పెట్రోలు , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గింది.

Related Posts